విడాకుల పై మొదటిసారి స్పందించిన చిరంజీవి కూతురు శ్రీజ..!?

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఈమె గతంలో ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి కోసం ఇంట్లో నుండి ఇంట్లో వాళ్ళని కాదు అనుకొని బయటికి వెళ్లిపోయిన సంగతి అప్పట్లో ఎంత సెన్సేషన్ గా మారిందో మనందరికీ తెలిసిందే. అయితే వారికి ఒక పాప కూడా ఉంది. కానీ ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తరువాత కొన్ని మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ విడాకులు తీసుకునీ విడిపోయారు. కూతురు బాధ చూడలేక మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తికి పెళ్లి చేయడం జరిగింది. ఈ ఇద్దరికి కూడా ఒక పాప ఉంది. తన పేరు అవిష్క. కొంతకాలం  బాగానే కలిసి ఉన్నారు. ఆ తరువాత ఉన్నట్టుండి సోషల్

 మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం. వారికి సంబంధించి ఫోటోలు  డిలీట్ చేసుకోవడంతో అందరూ ఎందుకు  ఇలా చేస్తున్నారు అని ఒక కన్ఫ్యూషన్ లో పడిపోయారు.  ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారా అన్న అనుమానాలు సైతం వచ్చాయి. అలాంటి సమయంలోనే అందరూ ఊహించినట్లుగానే కళ్యాణ్ దేవ్ శ్రీజ ఇద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ప్రస్తుతం ఇద్దరు కూతుర్లను తీసుకొని మెగాస్టార్ ఇంట్లోనే ఉంటుంది అన్న విషయం ఇప్పటివరకు మెగా కుటుంబంలో ఎవ్వరూ బయట పెట్టలేదు. కానీ కొన్ని కొన్ని పోస్టులు చూస్తే మాత్రం నిజంగానే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు అని క్లారిటీ వస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకి కళ్యాణ్

  కూతురుని ఇంటికి తీసుకువచ్చి తన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. దాంతో అందరూ వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు అని కన్ఫామ్ చేసుకున్నారు. ఇదే విషయంపై శ్రీజను చాలా సార్లు సోషల్ మీడియా వేదికగా ఆమె అభిమానులు అడిగినప్పటికీ ఒక్కసారి కూడా దీనిపై స్పందించలేదు. అయితే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా తనకి ఒక ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానం ఇచ్చింది ఆమె. ఎవరైనా తమను తాము ఏ స్థాయిలో ఊహించుకుంటారో అదే స్థాయిలో చూస్తారు అని.. అదే స్థాయి కావాలి అనుకుంటారు అని.. ఇదే ఎన్నో ప్రశ్నలకు సమాధానం అంటూ తెలిపింది. దీంతో మరొకసారి శ్రీజ తన విడాకులపై క్లారిటీ ఇచ్చింది అని అంటున్నారు నేటిజన్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: