బాబుకు జగన్ వల్ల నిద్రలేని రాత్రులు.. అప్పటివరకు టెన్షన్ తగ్గే అవకాశం లేదా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇప్పటికీ ఏ పార్టీది గెలుపు అనే ప్రశ్నకు టఫ్ ఫైట్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కూటమి గెలిచినా వైసీపీ గెలిచినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని ప్రచారం జరుగుతోంది. అయితే జగన్ 151 సీట్లకు మించి వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పిన మాటతో చంద్రబాబు జగన్ వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
 
ఈ ఎన్నికల్లో ఓటమిపాలైతే టీడీపీ భవిష్యత్తుకే ప్రమాదం అని బాబు బలంగా నమ్ముతున్నారు. గెలుపు కోసం జనసేన, బీజేపీ నేతలను ఎంతో కష్టపడి బుజ్జగించారు. 50 ఏళ్లకే పెన్షన్, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి అంటూ బాబు హామీలను ప్రకటించడం వెనుక కారణం కూడా అనే సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కూటమి నేతలు భారీ స్థాయిలో ఖర్చు చేశారని టాక్ ఉంది.
 
అయితే ఎన్ని చేసినా అపజయం వస్తే ఏం జరుగుతుందో అనే భయం మాత్రం బాబులో ఉంది. బాబు అనుకూల వెబ్ సైట్లు రాయలసీమలో కూడా కూటమి సత్తా చాటుతుందని ప్రచారం చేస్తుంటే ఆ వార్తలు చదివి నవ్వుకోవడం సీమవాసుల వంతవుతోంది. జూన్ 4వ తేదీ అసలు బండారం బయటపడుతుందని మరీ ఇంత నిస్సిగ్గుగా వార్తలు ఎలా రాస్తారని ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
 
సీమలో కూటమికి 10 సీట్లు వస్తే గొప్ప అని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులు నెలకొన్నా కూటమి కోసం ఎంతకైనా దిగజారుతాం అనే విధంగా కొన్ని పత్రికలు, వెబ్ సైట్ల తీరు ఉంది. చంద్రబాబు ఎంత చెప్పినా పథకాలను అమలు చేయడం మాత్రం తేలిక కాదని రాష్ట్ర ఆదాయం ఎంత పెరిగినా ఆ ఆదాయంలో అప్పులు తీర్చడానికి ఆ అప్పులకు వడ్డీలు కట్టడానికి కూడా కేటాయించాల్సి ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ఫలితాలతో బాబు భయం నిజం అవుతుందో కాదో తేలిపోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: