రాజకీయ రుద్రమలు: నారీ శక్తులు.. రాయలసీమ రతనాల బిడ్డలుగా మారేరా..?

Divya
•పదవి కోసం తోబుట్టువులనే దూరం పెట్టిన సునీత..
* భర్త సహకారంతో ఉషశ్రీ మళ్ళీ అధికారంలోకి  వస్తుందా..
* ప్రజల సానుభూతి బండారు శ్రావణి కి కలిసొచ్చేనా
* నాన్ లోకల్ అయినా ఎంపీగా గెలిచి తీరుతానంటున్న జోలదరాశి శాంత..
(రాయలసీమ - ఇండియా హెరాల్డ్ )
మహిళలు.. అన్ని రంగాలలో సమాన హక్కులు పొందుతూ అన్ని విధాలా తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకుంటున్నారు.. ఈ క్రమంలోనే రాజకీయ రంగంలో కూడా అడుగులు వేసి తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంటున్నారు.. ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్ లో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మగవారితో పోటా పోటీగా ఆడవారు ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొంటూ అధికారంలోకి రావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.. అధికార పార్టీ నుంచి.. ప్రత్యర్థ పార్టీల నుంచి పోటీ చేయడానికి టికెట్టు దక్కించుకున్న నారీ శక్తులు ప్రత్యర్థుల ఆగడాలను అరికడతారా అన్న విషయం ఇప్పుడు అందరిలో ఉత్కంఠత రేకెత్తిస్తోంది. మరి ఈ రాజకీయ రుద్రమలు తమకు పోటీగా వస్తున్న ప్రత్యర్ధులకు.. తమ పవర్ ఏంటో చూపించడానికి సిద్ధం అయ్యారు.. మరి రాయలసీమ ప్రాంతంలో రతనాల బిడ్డలుగా వెలుగు వెలిగేది ఎవరో ఇప్పుడు చూద్దాం..

బండారు శ్రావణి:
అనంతపురం జిల్లా అత్యధిక ప్రభావంతమైన నియోజకవర్గాలలో శింగనమల కూడా ఒకటి. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడు ఉత్కంఠతను కలిగిస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ తరఫున టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు బరిలోకి తిరుగుతుండగా ఆయనకు పోటీగా టిడిపి తరఫున బండారు శ్రావణి రంగంలోకి దిగుతోంది.. ఈసారి ఎక్కువగా అవకాశాలు ఈమెకే కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో పోటీ చేసి ఓడిపోయిన బండారు శ్రావణి పై సానుభూతి ఎక్కువగా ఉంది. ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలి అని.. అభివృద్ధి పనులు చేపట్టాలి అని.. ఇంటింటికి గడపగడపకు వెళ్లి తాను అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి పనుల గురించి ప్రజల్లో చెబుతూ వారిలో చైతన్యాన్ని నింపుతోంది.. అంతేకాదు ప్రజలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది బండారు శ్రావణి. మరొకవైపు టిప్పర్ డ్రైవర్ అయిన వీరాంజనేయులు కి రాజకీయ అనుభవం లేదు. అయితే ఈయనను వైసిపి అభ్యర్థిగా ప్రకటించినప్పుడు టిప్పర్ డ్రైవర్ అంటూ టిడిపి అధినేత చంద్రబాబు హేళన చేశారు. ఆ అంశంలో ప్రజల్లో ఈయనకు సానుభూతి ఉన్నా.. రాజకీయ అనుభవం లేకపోవడం వల్ల ఓట్లు పడే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.. ఇక ఇతడి పై పోటీకి దిగుతున్న బండారు శ్రావణి అధికారంలోకి వస్తుందనే వార్తలు స్పష్టం అవుతున్నాయి.
పరిటాల సునీత:
రాప్తాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పరిటాల సునీత పోటీకి దిగుతోంది. ఈమె కూడా గతంలో ఓడిపోవడంతో ప్రజలలో సానుభూతి ఏర్పడింది.. అయితే ఈమెపై విమర్శలు కూడా చాలానే ఉన్నాయి అధికారంలో ఉన్నప్పుడు ఈమె పేరును అడ్డుపెట్టుకొని ఈమె తమ్ముళ్లు అరాచకాలకు పాల్పడ్డారు.. రాప్తాడు అభివృద్ధికి ఈమె ఎంత పాటుపడినా సరే ఈమె తమ్ముళ్ల వల్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది. ఈ కారణంగానే గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయింది. ఈసారి ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని తన ప్రజలకు మళ్ళీ మంచి చేయాలని తన తోబుట్టులను కూడా దూరం పెట్టింది సునీత.. ఇలాంటి పలు కష్టాల మధ్య తాను నారీశక్తిగా మారి అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తోంది ..మరి సునీత పోరాటం ఎంతవరకు సాగుతుందో చూడాలి.
ఉషశ్రీ చరణ్..
గత ఎన్నికల్లో పోటీ చేసి కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా గెలిచి ఏపీ మంత్రిగా కూడా సంచలనం సృష్టించింది ఉషశ్రీ చరణ్.. టిడిపి కంచుకోటగా ఉన్న కళ్యాణదుర్గంలో ushashri CHARAN' target='_blank' title='ఉషశ్రీ చరణ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఉషశ్రీ చరణ్ గెలవడం ఒక సంచలనం అయితే తర్వాత ఆమె మంత్రి అయ్యి మరొక సంచలనాన్ని సృష్టించింది. ఇక భర్త శ్రీ చరణ్ రెడ్డి వల్లే ఆమెకు టికెట్ వచ్చిందని స్థానికంగా చక్రం తిప్పేదంతా ఆమె భర్త అని అందరూ చెబుతూ ఉంటారు.. అయితే భర్త సహాయ సహకారాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది ఉషశ్రీ చరణ్. ఈసారి పెనుగొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఈమెఎలాగైనా సరే అధికారంలోకి వచ్చి మళ్లీ తన స్టామినా చూపించాలని చూస్తోంది.
జోలద రాశి శాంత:
హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీకి దిగుతున్న జోలద రాశి శాంత.. తను కర్ణాటక బళ్లారి ప్రాంతానికి చెందిన వారైనప్పటికీ తన మెట్టినిల్లు గుంతకల్లు అని.. కాబట్టి తాను ఆంధ్ర కోడల్ని అని.. తాను బరిలోకి దిగి గెలిచి చూపిస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తోంది జోలదరాశి శాంత. గతంలో బీజేపీ బళ్లారి  ఎంపీగా పనిచేసిన ఈమె ఆ తర్వాత వైసిపి తీర్థం పుచ్చుకొని.. ఇక్కడ నుంచీ కూడా ఎంపీ గా పోటీకి దిగుతోంది.  హిందూపురం నుంచి పోటీ చేస్తున్న ఈమెకు స్థానికంగా పెద్దగా బలాబలాలు లేవు.. మరి నాన్ లోకల్ అనే ట్యాగ్ తగిలించుకున్న శాంత ఏ విధంగా ఎంపీగా గెలుస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: