టిల్లు స్క్వేర్: అరుదైన రికార్డులు సృష్టించిన సిద్దు?

Purushottham Vinay
డిజే టిల్లుకి సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టిల్లు స్క్వేర్ చిత్రానికి మొదటి రోజు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డిజే టిల్లు లాగే టిల్లు స్క్వేర్ లో కూడా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ గా ఉండడంతో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది.ఈ మూవీ పై మొదటి నుంచి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కారణంగా యూత్ ఆడియన్స్ నుంచి ఫస్ట్ డే ఈ మూవీకి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్లో కూడా టిల్లు స్క్వేర్ సినిమా సత్తా చాటడం విశేషం. మాస్ ఏరియాల్లో చాలా వరకు హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి. మల్టీప్లెక్స్ లలో కూడా 80 నుంచి 90 శాతం దాకా థియేటర్స్ ఫుల్ అయ్యాయి.ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమాకి మొదటి రోజు ఏకంగా 23.7 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఒక మీడియం రేంజ్ హీరోకి ఈ స్థాయిలో కలెక్షన్ రావడం అంటే మాములు విషయం కాదు. దీన్ని బట్టి మూవీపై ఏ రేంజ్ లో పాజిటివ్ బస్ క్రియేట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా అలాగే సినిమాపై ఉన్న బజ్ కూడా ఓపెనింగ్స్ కు బాగా హెల్ప్ అయ్యింది. మూవీ మేకర్స్ ప్రమోషన్స్ చేసిన విధానం పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసింది.


ఇక ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఏకంగా 1.2 మిలియన్ డాలర్స్ ని టిల్లు స్క్వేర్ సినిమా కలెక్ట్ చేసింది. ప్రీమియర్స్ కు కూడా గట్టి రెస్పాన్స్ వచ్చింది. ఓ విధంగా ఇది చిన్న హీరోల సినిమాలలో సూపర్ రికార్డు అని చెప్పాలి. ఈ మూవీలో టిల్లు గాడు చేసిన హంగామా, లిల్లీ తో లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ప్రేక్షకులకు కావలసినంత వినోదం బాగా అందించింది. ఇంకా అలాగే అనుపమ పరమేశ్వరన్ హాట్ పర్ఫామెన్స్ యూత్ కి విశేషంగా కనెక్ట్ అయింది.ఎలాగో వీకెండ్ తో పాటు సెలవులు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి టిల్లు స్క్వేర్ సినిమా ఖచ్చితంగా 100 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ అందుకోవడం గ్యారంటీ అని నిర్మాత బలంగా నమ్ముతున్నారు. ఈ సినిమా బయ్యర్లకు కూడా భారీగా లాభాలను ఈ సినిమా తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. ఈ మూవీని ఓవర్సీస్ లో రాధాకృష్ణ రిలీజ్ చేశారు. ఇక డైరెక్టర్ మల్లిక్ రామ్ కి కూడా ఈ మూవీతో సాలిడ్ బ్లాక్ బస్టర్ పడిందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.ఇక గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సినిమా కూడా బాగా ఆడుతుంది. ఈ రెండు సినిమాలు తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో బాగా హౌస్ ఫుల్ అయ్యి రన్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: