ఇళయరాజా బయోపిక్ పోస్టర్.. ఈ లాజిక్ ధనుష్ ఎలా మిస్ అయ్యాడు?

praveen
ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ సినిమాలకు ఎంతలా క్రేజ్ ఉందో ఒక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది సినీ రాజకీయ క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే అందరికీ తెలిసిన సెలబ్రిటీల గురించి ఎన్నో తెలియని విషయాలను సినిమాల్లో చూపిస్తూ ఉండడంతో.. ఇక ప్రేక్షకులు అందరూ కూడా ఇలాంటి బయోపిక్ సినిమాలను చూడడానికి తెగ ఆసక్తిని కనబరుస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 అయితే ఇక ఇప్పుడు ఇలాంటి ఒక క్రేజీ బయోపిక్ తెరకేక్కెందుకు సిద్ధమైంది. స్వర మాంత్రికుడు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా జీవిత కథ ఆధారంగా బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ మూవీ డైరెక్టర్ అరుణ్ మాతేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉండడం గమనార్హం. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇళయరాజా పాత్రలో నటిస్తున్నాడు అని చెప్పాలి. కనెక్ట్ మీడియా ఈ మూవీని నిర్మిస్తూ ఉండడం గమనార్హం. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషలలో ఇక ఈ సినిమాను ఏకకాలంలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

 ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. కాగా ఇటీవల ఏకంగా సినిమా టైటిల్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఇలా రిలీజ్ అయిన టైటిల్ పోస్టర్ పై ప్రస్తుతం విమర్శలు చేస్తున్నారు ఇంటర్నెట్ జనాలు. తేని జిల్లాలోని పరమాన్నపురంకు చెందిన ఇళయరాజా తన సోదరుడి పాటల బృందంలో చేరి చిన్నతనంలో వామపక్ష సభల్లో పాడేవారు  ఇక ఆ తర్వాత సినిమాల్లోకి రావాలని భావించిన ఆయన చెన్నైకి వచ్చి సంగీత దర్శకుడుగా అవకాశాల కోసం ఆఫీసులో చుట్టూ తిరిగారు. చివరికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగారు. సినిమాలకు సంగీతం అందించారు  అయితే ఇటీవల విడుదలైన పోస్టర్ లో ఇళయరాజా చెన్నైకి రాగానే నేరుగా చెన్నై సెంట్రల్ లో దిగినట్లు కనిపిస్తోంది. అలాగే మధురై నుంచి రైలులో సెంట్రల్ ఎలా వచ్చిందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అప్పట్లో తేని జిల్లా మదురై జిల్లాలో భాగంగా ఉండేది  కాబట్టి తేని ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే మధురై వచ్చి రైలు లేదా బస్సులో వెళ్లేవారు. ఇళయరాజా తేనిప్రాంతంలోనే పరమాపురం నుంచి మధురై కి వచ్చి అక్కడి నుండి ప్రయాణించి చెన్నై సెంట్రల్ లో ఎలా దిగారు. ఇంత చిన్న లాజిక్ మర్చిపోయి ఎలా ఫస్ట్ పోస్టర్ని విడుదల చేస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: