సీటాడెల్ షూటింగ్లో అస్వస్థతతో సమంత..!!

Divya
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు తాజాగా సినిమాలకు కాస్త దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.. చివరిగా ఈమె ఖుషి చిత్రం తర్వాత మయోసైటీస్ కారణంగా కాస్త విశ్రాంతి తీసుకుంటున్నది.. కొన్ని రోజుల క్రితం ఇమ్యూనిటీ బూస్టింగ్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్న సమంత ఇప్పుడిప్పుడే తిరిగి మళ్ళీ తన వర్క్ ని మొదలు పెడుతోంది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం TAKE 20 పేరుతో తన ఆరోగ్య పరిస్థితులను కూడా అందుకు సంబంధించి జాగ్రత్తలను కూడా అభిమానులతో పంచుకోవడం జరిగింది సమంత.

మై జర్నీ విత్ ఆటో ఇమ్యూనిటీ పేరుతో యూట్యూబ్లో కూడా ఫలు వీడియోలను షేర్ చేసింది. మయోసైటీ సమస్యతో పోరాడుతున్న సమంత సిటా డెల్ సిరీస్ ని పూర్తి చేసింది.. అయితే యాక్షన్స్ సన్నివేశాలు చేస్తున్నప్పుడు సమంత అస్వస్థకు గురైందని తల కుదుపుకు గురవడంతో స్పృహతప్పి పడిపోయానని ఆ సమయంలో ఒక్కసారిగా సెట్ మొత్తం అప్సెట్ అయ్యిందని తెలియజేసింది.. మయోసైటీ సమస్య వారం వారం తగ్గుతుంది అనుకున్నప్పటికీ తనకెందుకు ఆ సమస్య వచ్చినప్పుడు అల్లా బాధపడ్డానని చాలా గిల్టీగా ఫీల్ అయ్యానని తెలిపింది సమంత.

ఏడాదిన్నరగా ఈ సమస్యతో పోరాడుతూనే ఉన్నాను నమ్మకం లేకపోతున్నానని మానసికంగా దృఢంగా ఉంటే దేనినైనా జయించవచ్చు అనుకున్నాను ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి చీకటి రోజులు ఉంటాయని ఓర్పుతో ముందుకు వెళ్లడం వల్లే ఆ జీవితం చాలా ఆనందంగా ఉంటుందంటూ సమంత వెల్లడించింది. ఖుషి సినిమా తర్వాత వెంటనే సిట డెల్ సిరీస్ చేయడానికి ఒప్పుకున్నారని ఈ సిరీస్ షూటింగ్ చేస్తున్న సమయంలో చాలా క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొన్నానని శారీరకంగా మానసికంగా కూడా చాలా కష్టపడ్డానని తెలిపింది సమంత. ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ తో సమతా కు నార్త్ ఇండియాలో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. మరొకసారి రాజ్ అండ్ డీకే దర్శకత్వంలోనే పనిచేసే అవకాశాన్ని అందుకుంది సమంత

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: