వింత డ్రెస్ లో ఊర్ఫీ జావేద్.. చూస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఉర్ఫి జావేద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వింత వింత డ్రస్సులు వేసుకుని జనాలకు కోపం తెప్పించడమే ఆమెకున్న ప్రత్యేకత అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు .తన డ్రెస్సుల పై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా తగ్గేదేలే అంటూ ముందుకు వెళుతుంది ఈ బ్యూటీ. రోజుకొక వెరైటీ డ్రెస్ తో జనాల్లోకి వస్తూ ఆకట్టుకుంటూ ఉంటుంది. నిత్యం సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఒక వెరైటీ డ్రెస్సులో ఎంట్రీ ఇచ్చింది. వాటికి సంబంధించిన ఫోటోలే ప్రస్తుతం 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఉర్ఫీ డ్రెస్సు అందరిని ఆకర్షిస్తుంది.. మొత్తం విశ్వాన్ని తన డ్రెస్సులో పెట్టేసి డిజైన్ చేయించుకొంది. సూర్యుడు చుట్టూ తిరిగి తొమ్మిది గ్రహాలను తన చుట్టూ తిప్పుకుంటూ ఉర్ఫీ ఆ డ్రెస్సుని రెడీ చేయించారు.. ఆ డ్రెస్సుతో ముంబై వీధుల్లోకి వచ్చేసింది.. ఆ డ్రెస్సులో ఆమెను చూసిన వార్తంతా సెల్ఫీలు దిగుతూ రోడ్డుపై హంగామా చేస్తున్నారు.. చాలా వింతగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ఈ డ్రెస్ ఏంటి ఇంత డిఫరెంట్ గా ఉందని ఫీల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు ,

టోలు నెట్టింట వైరల్ గా మారాయి.. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.. సైన్స్ ఎగ్జిబిషన్, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు ఉన్నప్పుడు ఈ డ్రెస్ బాగా అవసరం పడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. డ్రెస్సు సంగతి ఏమో గానీ ఉర్ఫీ మాత్రం చాలా అందంగా ఉందిని మరికొందరు నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు..  దీంతో ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా ఇటువంటి వెరైటీ డ్రెస్సులు వేసుకొని బయట తిరుగుతూ ఉండడంతో ఈమెను పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా చేశారు. కానీ వాటిని అసలు పట్టించుకోదు ఈ బ్యూటీ ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: