పెమ్మసాని పిలుపు : విజయోత్సవ ర్యాలీకి సిద్ధం కండి అంటూ... ప్రజల్లో జోష్ నింపుతున్నారా..?

FARMANULLA SHAIK
* టీడీపీలో జోష్ నింపిన పెమ్మసాని
* గుంటూరు క్లీన్ స్వీప్ దిశగా సైకిల్ పయనం
* కిలారిని పట్టించుకోని గుంటూరు ప్రజలు
గుంటూరు-ఇండియాహెరాల్డ్ :
 ఆంధ్రప్రదేశ్ లో మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ మరియు లోకసభకు పోలింగ్ జరగనున్నాయి.దానీలో భాగంగానే గుంటూరు లోక్ సభ నియోజకవర్గంలో ఏకపక్ష పోరు నడుస్తున్నట్లుగా మొదటి నుంచి తెలిసిన విషయమే దీనికి కారణం వైసీపీ తరపున సరైన అభ్యర్థులు పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడమే.వైసీపీ అధికారంలో ఉండగా గుంటూరు సిట్టింగ్ ఎంపీ జయదేవ్ ను వేధించి వారి వారి వ్యాపారాలపై ఫోకస్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టాం అనుకున్నారే కానీ ఒక డైనోసార్ లాంటి లీడర్ వచ్చి తమ మీద పడతారని వైసీపీ అసలు ఊహించలేదు.పెమ్మసాని ఎంట్రీ ఇచ్చిన తర్వాత గుంటూరు టీడీపీలో జోరు పెరిగింది.మొదట్లో గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంపై టీడీపీకి పెద్దగా ఆశలు లేవు కానీ పెమ్మసాని వచ్చిన తర్వాత అక్కడ సీన్ మారిపోయింది.వరుసగా అందరిని కలుపుకుపోయే భాగంగా ముస్లిం వర్గం ఆదరణ కోసం ప్రత్యేక వ్యూహం అమలు చేశారు.ప్రస్తుతం గుంటూరు పార్లమెంట్ మరియు అన్నీ అసెంబ్లీ స్థానాలు మొత్తం టీడీపీ కైవసం అనేలా ఉంది.పెమ్మసాని వాక్చాతుర్యంతో క్లాస్ గా కనిపిస్తున్నా మాస్ లీడర్గా ఎదిగారు.
మరో వైవు గుంటూరు పార్లమెంట్‌ అభ్యర్థి జంగాల అజరుకుమార్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌  ఒక వసల పక్షితో సమానం అని అన్నారు.అలాగే ఒక ఎన్‌ఆర్‌ఐ అయినా పెమ్మసాని ఇక్కడ ఎంపిగా గెలవాలని చూస్తున్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో ఆయన గెలిస్తే కనబడడు, వినబడడు అని, ఎక్కడ ఉంటాడో కూడా తెలియదనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు. ముస్లిం రిజర్వేషన్లపై మోదీ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఈయన కనీసం ప్రకటన చేయగలరా అని కూడా ప్రశ్నించారు.మరో వైపు కిలారి రోశయ్య పొన్నూరు వైసిపి ఎమ్మెల్యేగా ఉంటూ ఈసారి పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు. పక్కా లోకల్‌ అనే నినాదంతో ఆయన ప్రచారంలో పాల్గొంటున్నారు.అలాగే గత ఎన్నికల కన్నా ఈసారి వైసిపికి కొన్ని తరగతుల ప్రజలు దూరమయ్యారు.వట్టిచెరుకూరు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెమ్మసాని మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో మన పొలాలకు సంబంధించిన పాస్‌ పుస్తకాలు, ధ్రువపత్రాలు ప్రభుత్వం తీసుకుని నకలు కాపీలు మనకు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.కూటమి ప్రభుత్వం వచ్చే వరకు భూములను రిజిస్ట్రేషన్‌ చేయెద్దని సూచించారు. ఎన్నికల అనంతరం మనం మళ్లీ ఇదే విధంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించుకోవాలని చెప్పారు.కిలారిని పట్టించుకోని గుంటూరు ప్రజలు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: