అక్కినేనివారి ఫంక్షన్ కు సమంత..??

murali krishna
సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. ఎందుకంటే ఇప్పటికే ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఏడాది నుంచి సినిమాలు చేయకుండా దూరంగా ఉన్నప్పటికీ తాజాగా ఓ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ స్థానాన్ని సమంత సంపాదించుకుంది. ప్రస్తుతం కథలు వింటోంది. అట్లీ-అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న సినిమాలో ఓ హీరోయిన్ గా ఎంపికైందంటున్నారుకానీ చిత్ర యూనిట్ నుంచి అధికారికంగా ధ్రువీకరణ రావాల్సి ఉంది.సమంత ఎంతమంది హీరోలతో సినిమాలు చేసినప్పటికీ నాగచైతన్యతో చేసిన సినిమాలు మాత్రమే వెరీ స్పెషల్ అని చెప్పొచ్చు. వారిద్దరి కాంబినేషన్ కు తిరుగులేదు. ఏమాయ చేశావే, ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ వంటి సినిమాల్లో కలిసి నటించారు. వీరిద్దరి కోసమే సినిమాలు చూసే అభిమానులు ఉన్నారు. ప్రతి నటుడికి, ప్రతి నటికి తమ జీవితంలో ప్రత్యేకమైన సినిమాలు ఉంటాయి. అక్కినేని కుటుంబానికి సంబంధించి అలాంటి సినిమా ఒకటి ఉంది. అదే మనం. మనం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుతోపాటు నాగార్జున, నాగచైతన్య, అఖిల్ అందరూ కనిపించారు. వీరితోపాటు సమంతది కూడా చాలా ముఖ్యమైన పాత్ర.సినిమాలో అయినట్లే నిజ జీవితంలో కూడా నాగచైతన్య, సమంత పెళ్లి చేసుకున్నారు. మనస్పర్థలతో విడాకులు తీసుకున్నారు. మనం విడుదలై 10 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. ఈ సినిమాకు సంబంధించి జరిగే వేడుకకు సమంతను పిలుస్తారా? అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సమంతను ఈ ఫంక్షన్ కు పిలిస్తే అందరి దృష్టిలో సమంతకు నాగచైతన్య ఉన్న వాల్యూ ఇంకా ఇంకా పెరుగుతుందంటున్నారు. ఇప్పటికీ వీరిద్దరూ కలిసిపోవాలని కోరుకునే అభిమానులు లక్షల్లో ఉన్నారని చెప్పొచ్చు. విడాకుల తర్వాత నాగచైతన్య సమంత గురించి ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సమంత మాత్రం పరోక్షంగా కొన్నిసార్లు విమర్శలు చేసింది. ఆ విషయంలో అభిమానులు సమంతనే తప్పుపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: