ఏపీ: మరో రెండు పథకాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..!
ఆ తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని కూడా అమలు చేశారు.. దీపావళికి అటు ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు, ఉచిత ఫ్రీ బస్ ని కూడా అమలు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.. అయితే ఎప్పటినుంచో స్కూలుకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకం పైన , రైతులు ఎంతకాలమో ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం పైన కూడా తాజాగా ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసినట్లు తెలుస్తోంది. స్కూళ్లకు కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకం వర్తిస్తుందని తెలుపుతున్నారు. అలాగే ఇంట్లో ఎంతమంది చదువుతూ ఉంటే వారందరికీ కూడా 15000 చొప్పున ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో తెలియజేశారు.. ఈ పథకాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచే పథకాన్ని అమలు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట.
అయితే ఇందుకు ప్రతి ఏడాది కూడా 12 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని వెల్లడిస్తున్నారు.. అలాగే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి ఏడాది 20వేల రూపాయలు అందిస్తామని చెప్పిన వాటి మీద కూడా వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్ లో అమలు చేస్తామంటూ తెలియజేశారు.. దీంతో అటు ఏపీ ప్రజలకు మరో రెండు పథకాలకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం.. మరి ఏ మేరకు ఎవరెవరికి ఎలాంటి షరతులు పెడతారో చూడాలి మరి.