ఏపీ మహిళలకు శుభవార్త.. తల్లికి వందనం నగదు 15000 జమయ్యేది ఆరోజేనా?
తల్లికి వందనం నగదు 15000 జమ అయితే పిలలకు కావాల్సిన కనీస సౌకర్యాలను కల్పించడంతో పాటు పిల్లల ఫీజులను సైతం తల్లీదండ్రులు సులువుగా చెల్లించే అవకాశం అయితే ఉంటుంది. విద్యార్థుల హాజరుకు సంబంధించిన సమస్యల వల్లే ఈ ప్రభుత్వం ఈ స్కీమ్ అమలును ఆలస్యం చేస్తోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
తల్లికి వందనం స్కీమ్ అమలు విషయంలో ఏవైనా షరతులు ఉంటాయో లేదో చూడాలి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఈ స్కీమ్ ను అమలు చేస్తామని ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో చెప్పిన విధంగానే పథకాలను అమలు చేసే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2025 సంక్రాంతి పండుగ తర్వాత ఈ స్కీమ్ అమలయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉందని చెప్పవచ్చు.
ఏపీ సర్కార్ అన్నదాత సుఖీభవ స్కీమ్ ను మాత్రం 2025 సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నుంచి అమలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు మేలు చేసే స్కీమ్ కావడంతో ఎక్కువమంది ఈ స్కీమ్ పై దృష్టి పెట్టారని సమాచారం అందుతోంది. తల్లికి వందనం స్కీమ్ అమలు వల్ల మహిళలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఊహించని స్థాయిలో బెనిఫిట్ లభించనుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తల్లికి వందనం స్కీమ్ కు సంబంధించిన నగదును డైరెక్ట్ గా మహిళల ఖాతాల్లోనే జమ చేయనుండటం గమనార్హం.