సజ్జలకు షాక్‌..వైసీపీ ఆఫీస్‌ కు రాకుండా చెక్‌ ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ అనేక కష్టాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వైసీపీలో కీలకంగా ఉన్న నేతలపై... కేసులు బనాయిస్తోంది... కూటమి ప్రభుత్వం. ఇప్పటికే చాలామంది నేతలపై కేసులు పెట్టి... జైలుకు కూడా పంపించింది చంద్రబాబు సర్కార్. గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే తరహాలో వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వం కూడా రివేంజ్ తీర్చుకుంటూ అలాగే వ్యవహరిస్తోంది.

అయితే ఇలాంటి నేపథ్యంలోనే వైసీపీ సలహాదారులు,సజ్జల రామకృష్ణారెడ్డిని తాజాగా విచారణ చేశారు మంగళగిరి పోలీసులు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేసిన కేసులో... సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసి.. గురువారం రోజున విచారణకు పిలిచారు పోలీసులు. ఈ తరుణంలోనే గురువారం రోజు... విచారణకు హాజరైన... సజ్జల రామకృష్ణారెడ్డి... తన ఫోన్ మాత్రం పోలీసులకు ఇవ్వలేదట.

అలాగే... బాలీవుడ్ నటి కేసు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి... మెడకు చుట్టు కున్నట్లు తెలు స్తోంది. ఈ కేసులో కూడా ఏ క్షణమైనా... సజ్జల రామకృష్ణారెడ్డి పైన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందట. అయితే సజ్జల రామకృష్ణారెడ్డిని చంద్ర బాబు కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిన నేపథ్యంలో.... వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారని సమాచారం.  వైసిపి పార్టీ సలహాదారులుగా ఉన్న సభ్యుల రామకృష్ణారెడ్డికి షాక్ ఇస్తూ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారట.

వైసీపీ సలహాదారులుగా ఉన్న సజ్జలను తొలగించి... ఆయన స్థానంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డిని ఫైనల్ చేయాలని అనుకుంటున్నారట. ఈ మేరకు ఇప్పటికే పార్టీ నేతలతో కూడా చర్చించారట జగన్మోహన్ రెడ్డి. వైసీపీ నేతలు కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని తొలగించాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. కానీ వైయస్ జగన్మోహన్ రెడ్డి లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి జైలుకు వెళ్లేలా కనిపించడంతో... విజయసాయిరెడ్డిని... తెరపైకి  తీసుకొస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: