బెట్టింగ్ లొద్దు మిత్రమా: జగన్ వన్స్ ఎగైన్..!

Pandrala Sravanthi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  అసెంబ్లీ నియోజకవర్గాలు 25 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు ముగిసాయి. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో చిన్నచిన్న గొడవలు మినహా అంతా ప్రశాంతంగానే సాగింది. ప్రస్తుతం ఎన్నికలు అయితే ముగిసాయి కానీ  ప్రధానమైన లెక్కింపు అనేది ఉంది. దీని కోసమే ప్రతి ఒక్క అభ్యర్థి రెండు రాష్ట్రాల ప్రజలు కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఎన్నో సర్వే సంస్థలు, ఎగ్జిట్ పోల్స్ ఇలా రకరకాల సర్వేలు బయటకు వస్తున్నాయి.  ఇందులో కొన్ని సర్వేలు టిడిపికి సపోర్టుగా ఉంటే మరికొన్ని సర్వేలు వైసీపీకి సపోర్ట్ గా వస్తున్నాయి. ఏది ఏమైనా టఫ్ ఫైట్ నడిచింది అనేది మాత్రం అందరికీ తెలిసిన విషయమే.  కట్ చేస్తే ఎన్నికల కోసం 2023 నుంచే కసరత్తు మొదలుపెట్టిన నాయకులు  ఎన్నికలు ముగిసే వరకు చాలా బిజీగా ఉన్నారు. 

సభలు, సమావేశాలు, స్పీచ్ లు అంటూ 24 గంటల పాటు ప్రజలతో మమేకమయ్యారు. ప్రస్తుతం ఎన్నికలు ముగిసాయి. దీంతో బడా నాయకులు, ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు  వారి వారి కుటుంబాలతో కలిసి వెకేషన్స్ కి వెళ్లారు.  కానీ లోకల్ లో ఉండే కార్యకర్తలు, చిన్న స్థాయి లీడర్లు మాత్రమే మా పార్టీ గెలుస్తుంది అంటే, మా పార్టీ గెలుస్తుంటుంది అంటూ బెట్టింగులు కాస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ లో, టీవీల్లో, పత్రికల్లో వచ్చే సర్వేల ఆధారంగా ఒక్కొక్కరు  వేల నుంచి కోట్లాది రూపాయల వరకు బెట్టింగులు కాస్తున్నారట. మరి ఈ బెట్టింగులు ఎవరికోసం. ఏ ఎన్నికల్లో అయిన ఒక రాజకీయ పార్టీ ఓడితే మరో రాజకీయ పార్టీ గెలుస్తుంది.

 ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా నాయకులకు ఒరిగేదేమీ లేదు. కానీ వాళ్లపై బెట్టింగులు కాచి ఓడిపోయిన కొంతమంది వ్యక్తులు  ఆర్థికంగా దివాలా తీస్తున్నారు. మరి ఈ బెట్టింగులన్నీ అవసరమా అని కొంతమంది రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే తరుణంలో  జగన్ ఎన్నికల రిజల్ట్ పై ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు. 151 పైగా అసెంబ్లీ స్థానాలు, 22 పార్లమెంటు స్థానాల్లో జెండా ఎగరవేయబోతున్నామని బాహాటంగానే చెప్పారు.

జగన్ ఎప్పుడైతే ఈ మాట మాట్లాడారో అప్పటి నుంచి వైసీపీ గెలుస్తుందని విపరీతంగా బెట్టింగులు కాస్తున్నారు. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజం, కానీ బెట్టింగ్ కాచి కుటుంబాలను రోడ్డున పడేసుకోవడం అనేది  విరుద్ధమని అంటున్నారు నిపుణులు.ఇదే తరుణంలో అన్ని సర్వేలు, రాజకీయ పార్టీలు  జగన్ వైపే జనాలు మొగ్గు చూపారని అంటున్నాయి. ఇవన్నీ గమనిస్తే మాత్రం  ఈసారి జగన్  మళ్లీ గెలవబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు  గ్రామాల నుంచి పట్టణాల వరకు  "జగన్ వన్స్ ఎగైన్" అంటూ  నినాదాలు కూడా బయటకు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: