సినీ హీరోలకు భారీ షాకివ్వనున్న ఏపీ సర్కార్.. ఆ స్టార్స్ కు ఇబ్బందేనా?

Reddy P Rajasekhar
ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాకపోవడానికి టికెట్ రేట్లు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తక్కువ టికెట్ రేట్లతో అఖండ అద్భుతమైన కలెక్షన్లను సాధిస్తే ఎక్కువ టికెట్ రేట్లతో అఖండ2 సినిమా ఆ కలెక్షన్లను బ్రేక్ చేసే విషయంలో ఫెయిలైంది. అయితే ఏపీలో కూడా ఇకపై టికెట్ రేట్ల పెంపు ఉండబోదని తెలుస్తోంది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం.

టికెట్ రేట్ల పెంపు విషయంలో సామాన్యుల నుంచి విమర్శలు వ్యక్తమవుతూ ఉండటంతో పాటు హైకోర్టుల నుంచి ఇబ్బందులు ఎదురవుతుండటం ఇందుకు కారణమని చెప్పవచ్చు.  తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సినిమాలకు టికెట్ రేట్ల పెంపు ఉంటుందా లేదా అనే ప్రశ్నకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది.  ఏపీ  ప్రభుత్వం ఇప్పటివరకు సినిమాల విషయంలో కఠినంగా వ్యవహరించలేదు.

ఏపీ సర్కార్ టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు ఇచ్చినా ఆ పెంపు పరిమితంగా ఉండే అవకాశాలు ఉన్నాయనే  కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.  పాన్ ఇండియా స్టార్ హీరోలకు ఈ నిర్ణయాలు ఇబ్బందేనని చెప్పవచ్చు. ప్రతి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని భావిస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోలకు  టికెట్ రేట్ల పెంపు లేకపోతె కలెక్షన్లు అమాంతం తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

ఓటీటీల హవా పెరగడంతో పెద్ద సినిమాలు సైతం ఫస్ట్  వీకెండ్, సెకండ్ వీకెండ్ లో మాత్రమే భారీగా కలెక్షన్లు సాధిస్తున్నాయి.  అన్ని సినిమాలకు ఒకే విధంగా టికెట్ రేట్లు ఉండేలా ఏపీ ప్రభుత్వం జీవో ఇవ్వనుందని తెలుస్తోంది.  టికెట్ రేట్ల పెంపు ఇవ్వాలంటే ఏపీలో సినిమా షూటింగ్ జరిగి ఉండాలనే నిబంధనలను సైతం అమలులోకి తీసుకురానున్నారని సమాచారం అందుతోంది.


ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: