ఓటేస్తే ఐస్ క్రీమ్ ఫ్రీ.. ఎలక్షన్స్ ని భలే వాడేసాడుగా?

praveen
ఆలోచన ఉండాలే కానీ ఏ పనినైనా సరికొత్తగా క్రియేటివ్ గా చేయొచ్చు అని అందరికీ అనిపించేలా చేస్తూ ఉంటారు కొంతమంది జనాలు. ఎందుకంటే చేసే సాధారణమైన పనిని సరికొత్తగా చేస్తూ ఉంటారు. ఇలాంటివి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తూ ఉంటాయి. సాధారణంగా రెస్టారెంట్ నిర్వాహకులు.. అప్పుడు ఉన్న పరిస్థితులను క్యాష్ చేసుకొనేందుకు వినూత్నమైన ఆఫర్లను ప్రకటించడం చేస్తూ ఉంటారు. గతంలో ఉల్లిపాయల ధరలు తక్కువగా ఉన్నప్పుడు తమ దగ్గర ఏదైనా కొంటే ఉల్లిపాయలు ఫ్రీగా ఇస్తామని టమాటా ధరలు పెరిగినప్పుడు ఇక టమాటలు ఉచితంగా ఇస్తామని ఆఫర్లు పెట్టడం చూసాం.

 ఇక ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల హడావిడి కనిపిస్తుంది. ఒక్క రాష్ట్రంలో కాదు దేశవ్యాప్తంగా ఇలాగే ప్రచార హోరు కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే పార్టీలన్ని ప్రచారం చేయడంలో బిజీబిజీగా ఉన్నాయి  ఇంకోవైపు ఎన్నికల అధికారులు ఓటు హక్కు పై అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు కొంతమంది రెస్టారెంట్ నిర్వాహకులు ఎలక్షన్స్ ని తమ బిజినెస్ను పెంచుకోవడానికి ఉపయోగించుకుంటూ ఉండడం గమనార్హం. ఇక ఇటీవల ఒక వ్యక్తి చేసిన ఆలోచన కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఏకంగా ఎన్నికల్లో ఓటు వేసిన వారికి ఫ్రీగా ఐస్ క్రీమ్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు. ఇలా చేయడం ద్వారా ఒకవైపు బిజినెస్ కి మంచి ఆదరణ పెరగడంతో పాటు ఇంకోవైపు ఓటు హక్కు పై అవగాహన కల్పించినట్లు అవుతుందని సదరు వ్యక్తి ఒక గొప్ప ఆలోచన చేశాడు.

 ఇలా ఇప్పటివరకు సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగంపై స్వచ్ఛంద  సంస్థలు ప్రైవేట్ సంస్థలు అవగాహన కల్పిస్తూ ఉండగా.. ఇక్కడ ఒక రెస్టారెంట్ యజమాని చేసిన ఆలోచన మరింత హాట్ టాపిక్గా మారింది. కర్ణాటకలో రెండో దశ పోలింగ్ ఇటీవల జరగగా.. హుబ్లీలో ఓ దుకాణం ఓనర్ ఓటు వేస్తే ఐస్ క్రీమ్ ఫ్రీ అంటూ ప్రకటించింది. ఈ ఆఫర్ స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఓటు వేసిన అందరూ కూడా ఆ ఐస్ క్రీం షాప్ దగ్గరికి వెళ్లి చేతికి వేసిన సిరా చూపించి ఫ్రీగా ఐస్ క్రీమ్ తినేశారు. ఇక మరోవైపు అతని ఐస్ స్క్రీమ్ దుకాణానికి కూడా మంచి పాపులారిటీ వచ్చింది. ఇక ఈ విషయం తెలిసి ఇది నిజంగా గొప్ప ఆలోచన అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు నేటిజన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: