సల్మాన్ సరసన నటించిన ఆ అందాల భామ.. ఇప్పుడు ఇలా మారిపోయిందేంటి?

praveen
సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచం పైకి ఎంతో అందంగా కనిపిస్తుంటుంది. ఇది చూసి ఎంతో మంది సినిమాలో రాణించాలని పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని ఆశపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్నో కష్టనష్టాలు ఎదురైన పర్వాలేదు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే ఇక తర్వాత కాలంలో అదృష్టం కూడా కలిసి వచ్చి మంచి అవకాశాలను దక్కించుకుంటారు. కానీ ఇలా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్న వారు.. సైతం కొన్ని కొన్ని సార్లు తర్వాత కాలంలో దూర్పర పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఆయా సినీ సెలబ్రిటీలు ఇలా దీనస్థితిలో ఉండడం గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతూ ఉంటారు అని చెప్పాలి. ఇలా ఇప్పటివరకు ఎంతోమంది హీరో హీరోయిన్లు ఒకప్పుడు స్టార్లుగా కోట్లు సంపాదించినవారు.. ఆ తర్వాత కాలంలో మాత్రం వివిధ కారణాలతో ఇక చేతిలో చిల్లి గవ్వ కూడా లేక దుర్భర స్థితిలోకి వెళ్లిపోయిన వారు ఉన్నారు. ఇక ఇలాంటి వారిలో పూజ గద్వాల్ కూడా ఒకరు అని చెప్పాలి. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఎంతటి స్టార్ హీరో నో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి సల్మాన్ ఖాన్ సినిమాలో ఛాన్స్ వచ్చిందంటే హీరోయిన్ కి కూడా మంచి ఫాలోయింగ్ ఉండే ఉంటుంది అని అందరూ భావన.

 అయితే పూజా గద్వాల్ విషయంలో పరిస్థితి మరోలా ఉంది. ఒకప్పుడు సల్మాన్ ఖాన్ సరసన ఆడి పాడిన అందాల తార.. ఇక ఇప్పుడు కనీసం చేతిలో ₹100 కూడా లేని దుస్థితిలోకి వెళ్లిపోయింది. అనారోగ్య సమస్యలతో ఒంటరిగా జీవిస్తూ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. 1995లో విడుదలైన వీర గతి సినిమాలో సల్మాన్ సరసన హీరోయిన్గా నటించింది పూజ. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ పూజకి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. మరిన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ అవి కూడా హిట్ అవ్వలేదు. దీంతో వెండితెరపై అవకాశాలు తగ్గాయ్. తర్వాత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది పూజ. తర్వాత పెళ్లి చేసుకుని గోవాలో సెటిల్ అయింది. అంతలోనే టీబి సోకింది. దీంతో భర్త అత్తమామలు  ఆమెతో బంధాన్ని తెంచుకున్నారు. అవకాశాలు లేక ఆమె పరిస్థితి దుర్భరంగా మారింది. ప్రస్తుత ఆమె డాబా సర్వీస్ నడుపుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: