రెమ్యునరేషన్ పెంచేసిన ఆనంద్ దేవరకొండ.. ఎంత అంటే..?

Divya
టాలీవుడ్ లో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన హీరోలలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు.. ఇక ఈయన అండదండతో ఆయన తమ్ముడు ఆనంద్ దేవరకొండ కూడా ఇప్పుడిప్పుడే పలు సినిమాలలో నటించి యంగ్ హీరోలకు దీటుగా సినిమాలలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే వరుస పెట్టి సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళుతున్నారు. చివరిగా ఆనంద దేవరకొండ బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నారు. దాదాపుగా 100 కోట్ల రూపాయల వరకు ఈ సినిమా కలెక్షన్స్ గ్రాస్ రాబట్టింది..


అయితే ఆనంద్ దేవరకొండ రెమ్యూనరేషన్  బేబీ సినిమా ముందు వరకు ఒక రకంగా ఉన్న ప్రస్తుతం సినిమాల పరిస్థితికి వచ్చేసరికి పెరిగినట్టుగా తెలుస్తోంది. బేబీ సినిమాకి ముందు దాదాపుగా రూ .80 లక్షలు వరకు తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.కానీ ఇప్పుడు సక్సెస్ ట్రాక్ ఎక్కడంతో.. కోటిన్నర నుంచి రూ .2 కోట్ల వరకు అందుకుంటున్నట్లు సమాచారం.. అయితే ఈ విషయం పైన ఎలాంటి అధికారికంగా ప్రకటన అయితే వెలుబడలేదు. కానీ ఆనంద్ దేవరకొండ స్పీడ్ చూస్తుంటే మాత్రం ఆ రేంజ్ లో ఉన్నట్టుగా కనిపిస్తోంది.


ప్రస్తుతం సమ్మర్లో గంగం గణేశా అనే చిత్రంతో రాబోతున్నారు. మళ్లీ ఇప్పుడు తాజాగా డ్యూయెట్ అనే ఒక కొత్త సినిమా టైటిల్ పోస్టర్ని కూడా ఇటీవలే ప్రకటించడం జరిగింది. మొదట్ల ఆనంద దేవరకొండ ని చాలా మంది దారుణంగా ట్రోల్ చేసేవారు.. మిడిల్ క్లాస్ మెలోడి చిత్రంతో పరవాలేదు అనిపించుకున్న ఆనంద్ దేవరకొండ అప్పటినుంచి వరుసగా విభిన్నమైన కథ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. చివరిగా బేబీ సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు.. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న ఆనంద్ దేవరకొండ ఇలాగే సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్లాలని అభిమానులు కోరుకుంటున్నారు. రష్మిక తన అన్న విజయ్ దేవరకొండ సపోర్టుతో ముందుకు వెళ్తున్నారు ఆనంద్ దేవరకొండ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: