పెళ్లి తర్వాత కూడా ఆమె ఎన్నో తప్పులు చేసింది.. నటి భర్త షాకింగ్ కామెంట్స్?

praveen
సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ దృశ్య వారి గురించి ఏ విషయం తెరమీదకి వచ్చిన కూడా అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా సినీ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు  ప్రేక్షకులు అందరూ కూడా తెగ ఆసక్తిని కనబరుస్తూ  ఉంటారు. అయితే ఒకప్పుడు సినీ స్టార్స్ తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను రహస్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నించేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇక పలు ఇంటర్వ్యూలలో కూడా ఓపెన్ అవుతూ అన్ని విషయాలను చెప్పేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.

 ఇలా తమకు తెలిసిన సెలబ్రిటీల గురించి తెలియని నిజాలను తెలుసుకుంటూ షాక్ అవ్వడం అటు నెటిజెన్స్ వంతు అవుతుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు సీనియర్ నటి లక్ష్మీ గురించి ఇలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ సంచలనంగా మారిపోయింది. ఏకంగా లక్ష్మీ మాజీ భర్త ఆమెపై ఒక ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు చేశాడు. ఒకప్పుడు హీరోయిన్గా ఆ తర్వాత సహాయ నటిగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది లక్ష్మి. దాదాపు మూడు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఇక.. టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరుగా కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే.

 అయితే 1975లో నటి లక్ష్మి సహనటుడు అయినా మోహన్ శర్మను  పెళ్లి చేసుకుంది. కానీ 1980లో వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో చివరికి విడాకులు తీసుకొని విడిపోయారు. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి లక్ష్మి మాజీ భర్త మోహన్ శర్మ ఆమె గురించి సంచలన ఆరోపణలు చేశాడు. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకున్నాక.. నీ కుక్కలా పడి ఉంటాను అంటూ లక్ష్మీ నాతో చెప్పింది. ఇక ఆమె అడగడంతోనే ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. కానీ పెళ్లి తర్వాత కూడా ఆమె ఎన్నో తప్పులు చేసింది. అవన్నీ చెప్పలేను అంటూ మోహన్ శర్మ సంచలన కామెంట్స్ చేశాడు. ఇక మోహన్ శర్మ చేసిన కామెంట్స్ నేపథ్యంలో లక్ష్మీ పై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో పుట్టుకు వస్తున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: