చెడిపోతానని తెలిసిన లొంగిపోయాను.. నటి జయలలిత కామెంట్స్ వైరల్?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అనే రంగుల ప్రపంచంలో పైకి కనిపించేవన్నీ కూడా అబద్ధాలే అనే విషయం అప్పుడప్పుడు వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు తెలిసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. పైనకు ఎంతో అందంగా కనిపించే సినీ సెలబ్రిటీల జీవితాల్లో ఊహించని చేదు అనుభవాలు ఎన్నో ఎదురవుతాయి అని వారు ఇక మనసులో మాట బయట పెట్టినప్పుడు అందరికీ తెలిసి వస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇలాగే ఏకంగా తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది అలనాటి నటి జయలలిత.

 అప్పట్లో గ్లామర్ పాత్రలకు ఈమె కేర్ ఆఫ్ అడ్రస్ గా  ఉండేవారు. ఎన్నో ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక అప్పట్లో వరుస అవకాశాలతో చేతినిండా సంపాదించారు. ఇప్పుడు పలు సీరియల్స్ లో  నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే తన కెరియర్ గురించి ఇటీవల జయలలిత  ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒకప్పుడు గ్లామర్ పాత్రలు చేయడం వల్ల ఇప్పటికి కూడా తనకు మంచి పాత్రలు రావడం లేదు అంటూ చెప్పుకొచ్చింది.  అంతేకాదు ఇక ఆమెకు జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను  కూడా ఇటీవల తెలిపింది.

 ఒక డైరెక్టర్ ను ప్రేమించి పెళ్లాడిన ఆమె అతని టార్చర్ భరించలేక ఇక అతని నుంచి విడిపోయింది. అప్పటినుంచి సింగిల్ గానే ఉండిపోయింది. కాగా ఇటీవలే  ఇంటర్వ్యూలో పాల్గొన్న జయలలిత.. తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలను చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలు ఎక్కువగా చేయడంతో కొందరు ఆర్టిస్టులు వెంటపడేవారు. కానీ ప్రతిసారి తప్పించుకోలేకపోయేదాన్ని. కొన్నిసార్లు తప్పించుకున్నాను. మరికొన్నిసార్లు తప్పించుకోలేక తప్పనిసరై లొంగిపోయాను. నేను చెడిపోయిన పరవాలేదు. మా ఇంట్లో వాళ్ళు బాగుండాలని అనుకున్నాను. అందుకే అలా చేశాను. అలా అని ఎవరు ప్రేమించేవారు కాదు. పైశాచికత్వంతో ప్రవర్తించి కేవలం అవసరాలు మాత్రమే తీర్చుకునేవారు అంటూ జయలలిత తన జీవితంలో ఎదురైన ఎన్నో చేదు అనుభవాలను బయట పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: