కల్కి కి 6000 సంవత్సరాల నేపధ్యం !

Seetha Sailaja
మే 9న విడుదల కాబోతున్న ప్రభాస్ ‘కల్కి’ 2898 ఎట్టి పరిస్థితులలోను అనుకున్న తేదీకి విడుదలై తీరుతుంది అని దర్శకుడు నాగ్ అశ్విన్ చెపుతూ ఉండటంతో ప్రభాస్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా కథకు సంబంధించిన లీకులు ఊహాగానాల నేపధ్యంలో సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్నాయి.

అయితే ఈ రూమర్స్ కు చెక్ పెట్టే ఉద్దేశ్యంతో దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ అభిమానులకు అభయం ఇవ్వడంతో వారంతా ప్రస్తుతం చాల జోష్ లో ఉన్నారు. అయితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 28 భాషలలొ విడుదల అవుతున్న పరిస్థితులలో ఇంత తక్కువ సమయంలో ఈ 28 భాషలలోను డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి అయి విడుదల అవ్వడం సాధ్యం అయ్యే పరిస్థితి ఉందా అంటూ మరికొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.

లేటెస్ట్ గా ఈ సినిమా కథకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్తా హడావిడి చేస్తోంది. ఈ సినిమా కథ 6000 సంవత్సరాల కాలక్రమంలో మహాభారతం తో మొదలై భవిష్యత్తులో వచ్చే 2898 సంవత్సరం దాకా కొనసాగుతుంది అన్న సంకేతాలు వస్తున్నాయి. అయితే అందరు అనుకుంటున్నట్లుగా ఈ మూవీ కథ హాలీవుడ్ లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ ‘బ్లేడ్ రన్నర్’ కు అనుసరణ కాదనీ ఈ మూవీ స్టోరీ లైన్ అంతా తన టీమ్ తో ఆలోచించి ఫైనల్ చేసిన కథ అని అంటున్నారు.

అయితే మహాభారత ప్రస్తావన తీసుకు వస్తే కురుక్షేత్ర సంగ్రామం అంటే పాండవులు కౌరవులు శ్రీకృష్ణుడు ప్రస్తావన ఉంటుంది కాబట్టి ఏ రేంజ్ లో ఈ మూవీలో మహాభారత ప్రస్తావన ఉంటుంది అన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక ఈసినిమాను 2 పార్ట్ లుగా తీస్తున్న పరిస్థితులలో ఈమూవీ క్లైమాక్స్ లో మాత్రమే కమలహాసన్ పాత్ర పరిచయం అవుతుందని ఈమూవీ సెకండ్ పార్ట్ లో కమలహాసన్ నెగిటివ్ పాత్రకు సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి అని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: