ఎన్టీఆర్... చరణ్ లేటెస్ట్ మూవీస్ షూటింగ్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమ తమ సినిమా షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం వీరు ఏ సినిమాలలో హీరోగా నటిస్తున్నారు ..? ఆ మూవీ లకు సంబంధించిన షూటింగ్ లు ప్రస్తుతం ఏ ప్రాంతంలో జరుగుతున్నాయి అనే విషయాలను క్లియర్ గా తెలుసుకుందాం.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఎన్టీఆర్ మరియు మరి కొంత మంది ఇతరులపై ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ లో జాన్వి కపూర్ హీరోయిన్ గ నటిస్తూ ఉండగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చెంజర్ సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు రామోజీ ఫిలిం సిటీ లో రామ్ చరణ్ పై ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ సన్నివేశం ఈ మూవీ కే హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్ , ఎస్ జె సూర్య ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: