సినిమాలు ఎక్సేంజ్ చేసుకున్న మన స్టార్ హీరోలు వీళ్లే..!!

murali krishna
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మెగాస్టార్ చిరంజీవి తనయుడి గా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్..చాలా తక్కువ సమయం లోనే స్టార్ హీరో నకంటూ ఒక ప్రత్యే క గుర్తింపును సంపాదిం చుకున్నాడు.ఇక ఇలాంటి సమయం లోనే ఆయన చేసిన వరుస సినిమాలు సూపర్ హిట్లు గా నిలిచాయి. ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ చేయాల్సిన ఒక సినిమాను వేరే హీరో చేశాడనే విషయం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చిన జోష్ సినిమాను రామ్ చరణ్ చేయాల్సింది కానీ రామ్ చరణ్ అప్పుడు మగధీర సినిమాలో బిజీగా ఉండడం వల్ల ఆ సినిమా చేయలేకపోయాడు. అలా రామ్ చరణ్ చేయాల్సిన సినిమా ని నాగచైతన్య చేశాడు.
అలాగే నాగ చైతన్య చేయా ల్సిన ఒక సినిమా ని రామ్ చరణ్ చే శాడనే విషయం కూడా చాలా మందికి తెలియదు.  కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన 'గోవిందుడు అందరివాడేలే సినిమా స్టోరీ ని కృష్ణ వంశీ మొదట నాగచైతన్య కి చెప్పాడట. అప్పుడు నాగచైతన్య కొన్ని సినిమాలకు కమిట్ అయి ఉండడంవల్ల తను ఆ ప్రాజెక్టుని చేయలేకపోయాడు. ఇక అంతలోనే చిరంజీవి కృష్ణవంశీని పిలిచి రామ్ చరణ్ కి సెట్ అయ్యే కథను చెప్ప మని అడగగా, గోవిందుడు అందరి వాడేలే సినిమా స్టోరీ చెప్పి రామ్ చరణ్ ని లాక్ చేసాడు.  ఇక అలా నాగచైతన్య చేయాల్సిన సినిమాను రామ్ చరణ్.. రామ్ చరణ్ చేయాల్సిన సినిమా నాగచైతన్య చేశారు...ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చెంజర్ అనే సినిమా చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. అలాగే బుచ్చిబాబు సన డైరెక్షన్ లో మరో సినిమా కూడా చేస్తున్నాడు...ఇక వీటితో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: