విజయ్ దేవరకొండను కన్ఫ్యూజ్ చేస్తున్న ఎన్నికలు !

Seetha Sailaja
తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల వాతావారణం హోరెత్తి పోతోంది. ఛానల్స్ పత్రికలు అన్నీ రాజకీయ వార్తలతో నిండిపోతున్నాయి. సోషల్ మీడియా విషయానికి వస్తే రాజకీయ పార్టీ అభిమానులు ఒకరి పై ఒకరు చేసుకుంటున్న మాటల దాడితో ప్రజలకు పూర్తి వినోదాన్ని కలిగిస్తోంది. దీనితో సినిమాల గురించి సినిమా వార్తల గురించి జనం పట్టించుకోవడం మానేశారు.

ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా ఈ నెలాఖరుకు దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని ఏప్రియల్ 12వ తారీఖున తెలుగు రాష్ట్రాలలో ఒకేసారి ఎన్నికలు జరగబోతున్నాయని గట్టి ప్రచారం జరుగుతోంది. దీనితో ఏప్రియల్ నెల అంతా ఎన్నికల వాతావరణంతో వేడెక్కబోతోంది. ఇలాంటి పరిస్థితులలో ఏప్రియల్ 5న విడుదల కావలసి ఉన్న విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ మ్యాన్’ విడుదల అవుతుందా లేదా అన్న కన్ఫ్యూజన్ ఏర్పడింది.  

ఈసినిమాకు ఇప్పటికే మంచి ప్రీ రిలీజ్ పాజిటివ్ టాక్ కొనసాగుతున్న పరిస్థితులలో ఈ ఎన్నికల వేడి మధ్య తమ సినిమాను విడుదల చేస్తే కలక్షన్స్ దెబ్బతింటాయి అన్న కన్ఫ్యూజన్ లో దిల్ రాజ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా విడుదలైన వారం రోజులకి విడుదల కావలసి ఉన్న విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కూడ విడుదల చేయాలా వద్దా అన్న కన్ఫ్యూజన్ ఏర్పడినట్లు సమాచారం.

ఈ రెండు సినిమాలు విజయ్ దేవరకొండ కెరియర్ కు అదేవిధంగా విశ్వక్ సేన్ కెరియర్ కు చాల కీలకం కావడంతో ఈ ఎన్నికల రణరంగం మధ్య ఈ రెండు సినిమాలను విడుదల చేయకపోవడమే మంచిది అన్న ఆలోచనలు ఈసినిమా నిర్మాతలకు వస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇదే నెలలో తమిళ హీరోలు విక్రమ్ విశాల్ నటించిన భారీ సినిమాలు కూడ విడుదల కావలసి ఉన్నప్పటికీ ఎన్నికల వాతావరణం వల్ల ఈ రెండు సినిమాలు కూడ వాయిదా పడే ఆస్కారం ఉంది అంటున్నారు. అదే జరిగితే ఏప్రియల్ నెలలో ధియేటర్లు అన్నీ ఖాళీ అయిపోయే అవకాశం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: