బాలకృష్ణ మనసును మార్చిన టాక్సీవాల !

Seetha Sailaja
ఒకవైపు తన రాజకీయాలు కొనసాగిస్తూనే బాలయ్య బాబి దర్శకత్వంలో నటిస్తున్న సినిమాను పరుగులు తీయిస్తున్నాడు. అన్నీ అనుకున్నవి  అనుకున్నట్లుగా జరిగితే ఈమూవీని దసరా రేసులో నిలబెట్టాలని బాలయ్య ఆలోచన అంటున్నారు. ఇది ఇలా ఉండగా ‘టాక్సీవాల’ ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలకు దర్శకత్వం వహించిన రాహుల్ సంకృత్యాన్ బాలయ్యను దృష్టిలో పెట్టుకుని తయారుచేసిన ఒక కధకు ఓకె చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.

గతంలో రాహుల్ దర్శకత్వం వహించిన రెండు సినిమాలను చూసిన బాలయ్యకు రాహుల్ పై మంచి అభిప్రాయం ఉంది అంటున్నారు. ఆ అభిప్రాయంతోనే బాలయ్య రాహుల్ కథ చెప్పగానే ఓకె చేశాడు అని టాక్. ఇది ఇలా ఉంటే బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించవలసి ఉన్న ‘అఖండ 2’ మూవీ కథ కూడ ఇంచుమించు ఫైనల్ అవుతున్న పరిస్థితులలో బాలయ్య ముందుగా బోయపాటి వైపు అడుగులు వేస్తాడా లేదంటే రాహుల్ వైపు అడుగులు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అని అంటున్నారు.

యూత్ ఫుల్ మూవీలను తీయడంలో రాహుల్ కు ఉన్న సమర్థత రీత్యా బాలకృష్ణ ముందుగా రాహుల్ కథతోనే మూవీని చేసే అవకాశం ఉండీ అని అంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్న ఎన్నికలలో బాలకృష్ణ పోటీ చేయబోతున్న పరిస్థితులలో బాబి దర్శకత్వంలో నటిస్తున్న మూవీకి సమ్మర్ ఎండ్ వరకు బ్రేక్ పడే అవకాశం ఉండీ అని అంటున్నారు.

పరిస్థితులు ఇలా ఉంటే బాలకృష్ణ అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఒక మూవీని చేయబోతున్న నేపధ్యంలో ఆమూవీ బాలయ్య బోయపాటిల కాంబినేషన్ లో రాబోయే ‘అఖండ 2’ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల హడావిడి పూర్తి అయిన తరువాత బాలయ్య తన సినిమాలలో నటిస్తూనే తన కొడుకు మోక్షజ్ఞ కోసం సరైన కథను అన్వేషించబోతున్నాడు అన్న వార్తలు కూడా ఉన్నాయి. అయితే మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఇలా ప్రతిసారి వార్తలు రావడం సర్వసాధారణమైన పరిస్థితులలో వచ్చే సంవత్సరం అయినా ఖచ్చితంగా మోకజ్ఞ ఎంట్రీ ఉంటే బాగుండు అని అభిమానుల కోరిక..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: