ఆటో రాంప్రసాద్‌ ఎలాంటోడో చెప్పిన రైటర్‌ బెజవాడ ప్రసన్న కుమార్‌...!!

murali krishna
జబర్దస్త్ షో లో గుర్తింపు తెచ్చుకున్న ఆటో రాంప్రసాద్‌ గురించి షాకింగ్‌ విషయాలు వెల్లడించాడు రైటర్‌ బెజవాడ ప్రసన్నకుమార్‌. షోకి రాకముందు ఏం చేసేవాడో తెలిపాడు.ఆటో రాం ప్రసాద్‌ జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కామెడీ స్కిట్లని రాయడంతోపాటు జబర్దస్త్ షోలో కామెడీ చేస్తూ నవ్వులు పూయించారు. సుడిగాలి సుధీర్‌, గెటప్‌ శ్రీను, రామ్‌ ప్రసాద్‌ల టీమ్‌ అదిరిపోయేలా ఉంది. ఆద్యంతం నవ్వులు పూయిస్తూ టాప్‌లో నిలిచేది ఇప్పటికీ ఈ టీమ్‌ అదే దూకుడు ప్రదర్శిస్తుంది. మధ్యలో వీరి టీమ్‌లోకి హైపర్‌ ఆది వచ్చాక దాని రేంజ్‌ మరింత పెరిగింది.ఆటో రాంప్రసాద్‌ ఓవైపు అడపాదడపా సినిమాలు చేస్తూనే మరోవైపు జబర్దస్త్ షోని కంటిన్యూ చేస్తున్నాడు. ఇప్పటికీ అదే కామెడీని పంచడంలో అదే జోరు కొనసాగిస్తున్నాడు. అయితే ఈ నవ్వుల వెనకాల చాలా బాధలు ఉన్నాయట. ఆయన గురించి పలు ఆసక్తికర విషయాలను రాంప్రసాద్‌ స్నేహితుడు, రైటర్‌ బెజవాడ ప్రసన్నకుమార్‌ తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమ మధ్య ఉన్న బాండింగ్‌గా, తనకు కోసం చేసిన త్యాగాన్ని వెల్లడించారు బెజవాడ.సినిమాల్లోకి రావడానికి ముందు మొదట ఇద్దరు కలిసి ఒకే రూమ్‌లో ఉండేవాళ్లట. తనని బాగా నమ్మి, తనకోసం నిలబడ్డ ఐదుగురిలో ఒకడు రాంప్రసాద్‌ అని తెలిపారు బెజవాడ. తనకోసం ఎంతో త్యాగం చేశాడని తెలిపారు. నటుడిగా రాంప్రసాద్‌, రైటర్‌గా బెజవాడ చాలా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో రాంప్రసాద్‌కి `జోష్‌`లో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత మరో చిన్న సినిమా చేశాడట. కానీ ఆఫర్లు రావడం లేదు. మూడేళ్లు అవుతుంది. దీంతో తాను ఉండలే వైజాగ్‌ వెళ్లిపోయాడట. అక్కడ మెడికల్‌ రిప్రెజెంట్‌గా పనిచేశాడు. ఆసుపత్రిలు తిరుగుతూ, మందులు సేల్‌ చేశాడట.ఆ సమయంలోనే పెళ్లి కూడా చేసుకున్నాడట. ఓ వైపు తన ఫ్యామిలీని మెయింటేన్‌ చేస్తూ నెల నెల తనకు కూడా డబ్బులు పంపించేవాడని తెలిపారు. చాలా కాలం పాటు తనకు ఇబ్బంది లేకుండా చూసుకున్నాడని తెలిపారు రైటర్‌. తాను ఇక్కడ సినిమా ప్రయత్నాలు చేస్తున్నానని, ఆఫర్లు రాకపోవడంతో తాను కూడా వచ్చేస్తానని చెబితే, `ఒరేయ్‌ బాబు ఆ పనిచేయవాకు, అవసరమైతే ఇళ్లు అమ్మేసి డబ్బులు ఇస్తాను, నువ్వు మాత్రం ఆ పనిచేయకు, ఎన్నిరోజులైనా కొట్టే(ఆఫర్లు) రావాలి అని సపోర్ట్ చేసేవాడట.
ఆ టైమ్‌లో అతని ఒకే ఒక్క నమ్మకం.. వీడు(నన్ను) ఎప్పటికైనా సెట్‌ అవుతాడు, నాకు ఫోన్‌ వస్తుందని. అలాగే అతని బర్త్ డే రోజు ఫోన్‌ చేశా. ఏం కావాలి అని అడిగా, ఏం ఇస్తావన్నాడు. హైదరాబాద్‌ వచ్చేయ్‌, మళ్లీ తిరిగి ఇంటికి వెళ్లిపోకుండా చేస్తా అని చెప్పా. ఆ మాటతో వచ్చాడు. మళ్లీ ఈ రోజుకి ఇంటికి వెళ్లలేదు అని వెల్లడించాడు బెజవాడ.ఆ తర్వాత తనకు ఖర్చులకు మనీ పంపించేవాడని తెలిపాడు. ఓ వైపు తన ఫ్యామిలీని చూసుకుంటూనే మరోవైపు తనకు ఖర్చులకు డబ్బలు పంపించేవాడని, తాను ఎక్కడ బ్యాక్‌ అవుతానని అతనే ఆలోచించేవాడని, ఏ ఇబ్బంది రాకూడదని ఎంతో సపోర్ట్ చేశాడని తెలిపారు. కన్నీళ్లు తెప్పించాడు.బెజవాడ ప్రసన్న కుమార్‌ ప్రస్తుతం టాలీవుడ్‌ టాప్‌ రైటర్స్ లో ఒకరిగా రాణిస్తున్నారు. ఇటీవల ధమాఖా చిత్రానికి పనిచేశాడు. పలు భారీ ప్రాజెక్ట్ లకు పనిచేస్తున్నారు. త్వరలో దర్శకుడిగానూ మారబోతున్న.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: