ట్రోలర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన నాగార్జున హీరోయిన్....!!
చాలా కాలం తర్వాత ఇటీవల ముంబై ఎయిర్ పోర్టులో తన కుమారుడితో కలిసి కనిపించింది. ఆమెకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో ఆమె లుక్స్ పై ట్రోల్స్ జరిగాయి. పాస్టిక్ సర్జరీ తర్వాత ఆమె చాలా లావుగా అయ్యిందని.. తన ముఖం పూర్తిగా మారిపోయిందంటూ ట్రోలింగ్ జరిగింది. అయితే తన గురించి వచ్చిన ట్రోల్స్ పై అయేషా ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 ఏళ్ల తర్వాత కూడా అంతే అందంగా ఉండాలంటే ఎలా అంటూ మండిపడింది. తన ఇన్ స్టాలో ఓ పోస్ట్ షేర్ చేసింది.' నా సోదరి ఆసుపత్రిలో చేరడంతో రెండు రోజుల క్రితం నేను గోవాకు వెళ్లాను. ఆ సమయంలో ముంబై ఎయిర్ పోర్టులో కొందరు ఫోటోగ్రాఫర్స్ నా వీడియోస్, ఫోటోస్ తీశారు. నా వీడియోస్ చూసి చాలా మంది నాగురించి కామెంట్స్ చేస్తున్నారు. నా లుక్స్ గురించి మాట్లాడటం తప్ప దేశంలో మరో ముఖ్యమైన సమస్యలు లేవా ?.. నేను ఎలా కనిపించాలి.. జనాలు నన్ను ఎలా చూడాలి అనుకుంటున్నారు అనేది నాకు అవసరం లేదు. ఇప్పుడు నేను నా కుటుంబంతో ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాను. నాకు మళ్లీ ల్లోకి రావాలనే ఆలోచన లేదు. నాకు ఎలాంటి పాపులారిటీ మీద ఆసక్తి లేదు. కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండండి.. దయచేసి నా గురించి పట్టించుకోకండి. 15 ఏళ్ల క్రితం కనిపించినట్టే ఇప్పుడు ఉండాలంటే ఎలా ?.. అయినా నా లుక్స్ గురించి ఆలోచించడానికి సిగ్గుండాలి. మంచి వ్యక్తులుగా ఉండండి.. మీ స్నేహితులతో, కుటుంబాలతో సంతోషంగా ఉండండి. మీకు ఏది అవసరమో దాని గురించి ఆలోచించండి.. కానీ మీకు కోరుకున్నట్లుగా ఒక స్త్రీ కనిపించడం లేదని ఆలోచించకండి ' అంటూ రాసుకొచ్చింది.