గుంటూరు కారం' గూర్చి పెదవి విప్పిన ప్రముఖ రచయిత....!!
''గుంటూరు కారం ఎంత ఘాటుగా ఉంటుందో ఇందులోని హీరో పాత్రను అలా క్రియేట్ చేశారు. త్రివిక్రమ్ మంచి టైటిల్స్ పెడతారు. ఆయన సినిమాన్నింటిలో ఇది కొంత తేడాగా అనిపించింది. తల్లి వద్దనుకుంటే.. సంబంధిత డాక్యుమెంట్స్‌పై హీరో సంతకం పెడతాడా, లేదా? అనే పాయింట్‌కు కంపోజ్‌డ్ సీన్స్ రాసుకున్నారు. శారద- బాలకృష్ణ, వాణిశ్రీ- చిరంజీవి కాంబినేషన్‌లానే రమ్యకృష్ణ- మహేశ్ బాబు కాంబో ఉంటుందని ఊహించుకున్నా. కానీ, ఇది తల్లీకొడుకుల కథ. ఇందులో కథానాయకుడు.. అమ్మను దైవంలా కొలుస్తాడు తప్ప టీజ్ చేయలేడు, ఇబ్బంది పెట్టలేడు. ఈ సినిమా విషయంలో జరిగిన పొరపాటు అదే. అద్భుతంగా కథలు రాసే త్రివిక్రమ్ ఇది చాలు అనుకున్నారేమో''''తల్లీకొడుకు సెంటిమెంట్, తాత- మనవడు సెంటిమెంట్‌తో ఎన్ని సినిమాలు విజయం అందుకున్నాయో మీకు తెలుసు. ఇందులో ఆ రెండూ పండలేదు. సెంటిమెంట్ ప్రధానంగా సినిమాని తీద్దామనుకుంటే ఈ టైటిలే తప్పు. 'గుంటూరు అబ్బాయి' అని పెట్టి ఉంటే కుటుంబ కథా చిత్రం చూడబోతున్నామని ప్రేక్షకులు అనుకుని ఉండేవారు. గుంటూరు కారం.. పేరుకు సరిపోయేలా స్క్రీన్‌ప్లేని సెట్ చేశారు. సంతకం పెట్టించేందుకు హీరోయిన్.. హీరో ఇంటికొచ్చి, ప్రేమలో పడేయాలనుకుంటుంది. ఇది పాజిటివ్ దృక్పథం కాదు. రమ్యకృష్ణ కుటుంబానికి సంబంధించిన ఎమోషన్స్‌నే డెవలప్ చేసుకుంటూ వెళ్లి ఉంటే ఈ సినిమా మరో విధంగా ఉండేది. ఒకానొక సమయంలో ఫలానా పాత్రలో మార్పు వస్తుందని ఊహించా. కానీ, అలా జరగలేదు. ఏదైనా క్యారెక్టర్‌లో రియలైజేషన్ వచ్చి ఉంటే ప్రేక్షకుల హృదయానికి టచ్ అయ్యేది. త్రివిక్రమ్, మహేశ్ కాంబో కాబట్టి కలెక్షన్స్ వస్తాయి. డబ్బులు రావడం వేరు, సంతృప్తి రావడం వేరు. త్రివిక్రమ్ అంటే నాకు అభిమానం. ఆయన మళ్లీ మంచి కథతో వస్తారని ఆశిస్తున్నా'' అని పేర్కొన్నారు.