మెగాస్టార్ లాగా.. అమితాబ్ తన కొడుకుని స్టార్ హీరోగా ఎందుకు చేయలేకపోయాడో తెలుసా?

praveen
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ఇక ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. దాదాపు గత నాలుగు దశాబ్దాల నుంచి కూడా తిరుగులేని ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నారు ఆయన. అయితే మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ అనే గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా కూడా ఎదిగాడు. అయితే మొదట్లో సరైన కథలను ఎంచుకోక వరస ప్లాపులను చూసినప్పటికీ.. చిరంజీవి కొడుకుతో చాలా హార్డ్ వర్క్ చేయించి మరి కెరీర్ నిలబెట్టాడు అని చెప్పాలి. రొటీన్ కథలను కాకుండా వైవిద్యమైన కథలను ఎంచుకోవాలని  చరణ్ కు సూచించాడు చిరంజీవి. కొన్ని కథలను స్వయంగా చిరంజీవి విని ఇక ఓకే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు చరణ్ ఏకంగా తండ్రికి మించిన తనయుడు అని గుర్తింపును సంపాదించుకున్నాడు.

 ఇలా చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోవడంతో ఇక ఇప్పుడు అమితాబచ్చన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారిపోయింది. ఏకంగా ఇండియాలోనే ది బెస్ట్ ఆర్టిస్టుల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్న బిగ్ బి అమితాబచ్చన్.. తన కొడుకును స్టార్ హీరో రేంజ్ కి తీసుకెళ్లలేకపోయాడు. బిగ్ బి తన కొడుకు అభిషేక్ బచ్చన్ ను ఎంతో గ్రాండ్గా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. కానీ ఎందుకో అభిషేక్ మాత్రం సక్సెస్ అందుకోవడంలో వెనకబడ్డాడు అని చెప్పాలి. ఇక ఇప్పటికి కూడా అమితాబచ్చన్ కి ఉన్న క్రేజ్ అభిషేక్ బచ్చన్ కి లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే తన కొడుకు కెరియర్ నిలబెట్టడంలో అమితాబచ్చన్ కాస్త నిర్లక్ష్యం చేశాడు అని చెప్పాలి. కొడుకు ఎలాంటి కథలను ఎంచుకుంటున్నాడు అనే విషయంపై పెద్దగా పట్టించుకోలేదట. అందుకే అభిషేక్ బచ్చన్ సక్సెస్ కాలేకపోయాడట.  ఇలా ఒక స్టార్ హీరో తన కొడుకును కూడా స్టార్ కి హీరోగా మార్చడం అనేది ఎంతో కష్టంతో కూడుకున్న పని. కానీ మెగాస్టార్ మాత్రం ఇక ఈ విషయంలో సక్సెస్ అయ్యారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: