బాలయ్య.. విజయ్.. శర్వా.. దుల్కర్ లేటెస్ట్ మూవీస్ షూటింగ్ వివరాలు ఇవే..!

Pulgam Srinivas
ఈ రోజు కొన్ని తెలుగు సినిమాలకు సంబంధించిన షూటింగ్ లు జరుగుతున్నాయి. ఆ సినిమాలు ఏవి ..?  ప్రస్తుతం ఆ మూవీ లకు సంబంధించిన షూటింగ్ ఏ ప్రాంతంలో జరుగుతుంది. ఆ మూవీ బృందాలు ఆ చిత్రాలకు సంబంధించిన ఏ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు అనే విషయాలను తెలుసుకుందాం.
నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి చిత్ర బృందం ఇప్పటి వరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ బాలయ్య కెరియర్ లో 109 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో ఈ మూవీ యొక్క చిత్రీకరణను  "ఎన్ బి కె 109" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ బృందం పూర్తి చేస్తూ వస్తుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ మేకర్స్ బాలకృష్ణ మరియు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ముద్దు గుమ్మ పై హైదరాబాద్ లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ముంబై లో విజయ్ దేవరకొండ మరియు కొంత మంది ఇతరులపై ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
శర్వానంద్ ప్రస్తుతం ఓ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఆ మూవీ కి సంబంధించిన కీలక సన్నివేశాలను ప్రస్తుతం ఈ మూవీ బృందం హైదరాబాద్ లో చిత్రీకరిస్తుంది.
దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న లక్కీ భాస్కర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఇక ఈ మూవీ బృందం వారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలకమైన సన్నివేశాలను హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నారు.
 ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిత్రీకరణ దశల్లో ఉన్న ఈ నాలుగు మూవీ లపై కూడా తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: