6 రోజుల్లో "అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్" కు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!
6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 1.30 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... ఆంధ్ర ప్రదేశ్ లో 1.88 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకి 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.18 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి 6 రోజుల్లో కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్ సీస్ లో కలుపుకుని 1.01 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా 6 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 4.19 కోట్ల షేర్ ... 8.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి.
ఇకపోతే దాదాపు 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు 1.19 కోట్ల లాభాలను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలిచింది.