వెంకీతో నటించాలనే ఆశ తీరింది.. కానీ ఆ కోరిక అలాగే ఉండిపోయింది : ప్రియమణి

praveen
హీరోయిన్ ప్రియమణి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. అప్పట్లో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా హవా నడిపించింది. ఏకంగా ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమాలో హీరోయిన్గా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది అని చెప్పాలి.  తర్వాత కూడా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంది ప్రియమణి. అయితే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే తన ప్రియుడు ముస్తఫా రాజ్ ను వివాహం చేసుకుంది. అయితే ముస్తఫాకు ఇక ప్రియమణితో పెళ్లి రెండో వివాహం కావడంతో అప్పట్లో ఇక ఈ హీరోయిన్ వివాహం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

 అయితే పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది ప్రియమణి. ఇక ఆ తర్వాత  ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ అనే షోలో జడ్జిగా అవతారం ఎత్తింది. ఇక ఈ షో ద్వారా మళ్ళీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా దగ్గర అయింది. దీంతో ఇండస్ట్రీ నుంచి కూడా వరుసగా అవకాశాలు అందుకుంది. ఈ క్రమంలోనే ఏకంగా సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది. ప్రస్తుతం ఇక సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ ల తో కూడా బిజీబిజీగా ఉంది ఈ అమ్మడు. ఈ క్రమంలోనే ఒకప్పుడు హీరోయిన్గా రాణించిన దానితో పోల్చి చూస్తే ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోనే మంచి పాత్రలను అందుకుంటుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే ప్రియమణి నటించిన భామ కలాపం 2 ఈనెల 16వ తేదీన ఆహా ఓటీటి వేదికగా స్ట్రీమింగ్  అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది ఈ హీరోయిన్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి.. తన కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నారప్ప అనే సినిమాతో వెంకటేష్ తో నటించాలి అనే కోరిక తీరింది అంటూ చెప్పుకొచ్చింది ప్రియమణి. అదే సమయంలో ఇక తన కెరీర్ లో ఒక్కసారైనా నాన్ స్టాప్ గా నవ్వించే పాత్రలో నటించాలి అనే కోరిక ఎప్పటినుంచో అలాగే ఉండిపోయింది అంటూ చెప్పుకొచ్చింది. దీంతోపాటు పవర్ఫుల్ విలన్ రోల్ లో నటించాలి అనే కోరిక కూడా అలాగే ఉండిపోయిందని అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: