సుమా షోలో లిప్ లాక్ లు.. వామ్మో ఏంటీ బాసూ ఇది?

praveen
ఒకప్పుడు బుల్లితెర షోస్ ఎంత క్లీన్ అండ్ నీట్ కామెడీతో ఉండేవో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. సినిమాల్లో అయినా అక్కడక్కడ బూతు డైలాగులు వాడే వారేమో కానీ అటు బులితెర షోస్ లో మాత్రం బూతు డైలాగులు వినిపించేవి కాదు. కానీ ఇటీవల కాలంలో బూతు డైలాగులు లేని బుల్లితెర షో లేవు అనడం లో ఎలాంటి సందేహం లేదు. టిఆర్పి రేటింగ్స్ కోసం ఏకంగా ఎంతకైనా దిగజారి పోవడానికి సిద్ధమైపోతున్నారు.

 అయితే నిన్న మొన్నటి వరకు క్లీన్ అండ్ నీట్ కామెడీతో షోలు నడిపించిన సుమ సైతం ఇక ఇప్పుడు అందరిలాగానే కాస్త బోల్డ్ కామెడీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంది అని చెప్పాలి. అయితే గతంలో సుమ తన స్టైల్ మార్చుకోవడంతో కాస్త విమర్శలు కూడా వచ్చాయి  ఇక ఇప్పుడు సుమ అడ్డ అనే కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తుంది ఈ యాంకరమ్మ. అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా ఈసారి షో కి ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలను ఆహ్వానించారు. ఇలా షోలోకి వచ్చిన జంటలకి ఏకంగా రొమాంటిక్ టాస్క్ లను పెట్టింది సుమా.

 దీంతో ఇక షోలోకి వచ్చిన కంటెస్టెంట్స్ అందరూ కూడా  లిప్ లాక్ లతో రెచ్చిపోయారు. అదేంటి తెలుగు షోలో అది సుమా షోలో  లిప్ లాక్స్ ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారు కదా.. అయితే వాస్తవానికి లిప్ లాక్ కాకపోయినా నిజంగానే లిప్ లాక్ పెట్టేసుకున్నారు.  ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో డైరెక్ట్ గా లిప్ లాక్ పెట్టుకున్న ఫొటోస్ కూడా వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. అయితే ఇక వాళ్ళు ఇలా రొమాంటిక్ టాస్క్ ఆడుతున్న సమయంలో సుమ ఇచ్చిన రియాక్షన్ కూడా వైరల్ గా మారిపోయింది. ఇందుకు సంబంధించిన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: