సినిమాకు యావరేజ్ టాక్.. ప్రేక్షకులపై నిందలు వేసిన డైరెక్టర్?

praveen
సాంతరణంగా సినిమా బాక్సాఫీస్ వద్ద ఎప్పుడు ఎన్నో రకాల సినిమాలో విడుదలవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇలాంటి సినిమాలలో స్టార్ హీరోల సినిమాలు కొన్ని ఉంటే ఇక చిన్న హీరోల సినిమాలు మరికొన్ని ఉంటాయి. అయితే దర్శక నిర్మాతలు ఎంత భారీ బడ్జెట్ తో ఎంత జాగ్రత్తగా సినిమాలను తెరకెక్కించినప్పటికీ ఆ సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అన్నది మాత్రం కేవలం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది. ఇక ప్రేక్షకులకు సినిమా నచ్చింది అంటే సూపర్ హిట్ ఇస్తారు. సినిమాలో ఉన్నది చిన్న హీరోనా పెద్ద హీరోనా అన్నది అస్సలు పట్టించుకోరు.

 ఒకవేళ సినిమా నచ్చలేదు అంటే చాలు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన  డిజాస్టర్ అవ్వడం కూడా చూస్తూ ఉంటాం అన్న విషయం తెలిసిందే. అయితే సినిమా హిట్ అయితే దర్శక నిర్మాతలు సంతోషంలో మునిగిపోతారు. ఫ్లాప్ అయితే ఎక్కడో తప్పు జరిగింది ఇక ఇంకోసారి ఇలాంటి తప్పు జరగకుండా ప్రేక్షకులను మెప్పించాలి అని సర్ది చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే ఇక దర్శకుడు ప్రేక్షకులను నిందించడం ఎప్పుడైనా చూశారా. కానీ ఇటీవల హృతిక్ రోషన్ దర్శకుడు మాత్రం ఇలా ప్రేక్షకులను నిందించడం కాస్త సంచలనంగా మారిపోయింది.

 ఇటీవల హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఫైటర్ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే చిత్ర దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి. దేశంలోని 90% జనాభా విమానాల్లో ప్రయాణించలేదు. ఎయిర్పోర్ట్ కూడా చూసి ఉండరు. అలాంటి వారికి ఈ సినిమా ఎలా అర్థం అవుతుంది. ఈ మూవీ అలాంటి వారికి కాస్త వింతగా అనిపించవచ్చు అంటూ సిద్ధార్థ ఆనంద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిపోయాయి. అయితే ఇక డైరెక్టర్ వ్యాఖ్యలపై అటు నెటిజన్స్ అందరూ కూడా మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: