షాక్: భయంకరమైన జబ్బుతో బాధపడుతున్న పూనమ్ కౌర్.. వీడియో వైరల్..!!
అలాగే తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి పలు విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది.. ఇప్పుడు తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ట్విట్టర్ వేదికగా ఒక షాకింగ్ వీడియో ని షేర్ చేసింది.. ఈ వీడియోలో ఆరోగ్యమే మహాయోగం అనే కార్యక్రమంలో భాగంగా తను ఒక భయంకరమైన వ్యాధి తో బాధపడుతున్నట్లు తెలియజేసింది.. ఫైబ్రోమైయాల్జియా అనే వ్యాధి వల్ల దాదాపుగా రెండేళ్ల పాటు చాలా ఇబ్బందులు పడ్డానని తెలియజేసింది. ఈ జబ్బు వల్ల బట్టలు వేసుకోవడానికి కూడా వీలు ఉండేది కాదని..
అసలు మూమెంట్సే ఉండవు లూజు బట్టలే వేసుకోవాలని చాలా ఎమోషనల్ గా తెలిపింది.. నేచోతెరపి లెజెండ్ డాక్టర్ మంతెన గారిని కలవడం తనకి చాలా ఆనందాన్ని కలిగించిందని.. ఫైబ్రోమైయాల్జియా వైద్యానికి సంబంధించిన ఆయన ఇచ్చిన సూచనలు చాలా గొప్పవి.. మంచి మనసు గల వ్యక్తితో ఒక ఎపిసోడ్లో ఇలా పాల్గొనడం అనేది తన అదృష్టంగా భావించనీ ఒక ట్విట్టుని సోషల్ మీడియాలో రాసుకురావడం జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఈ శనివారం ప్రసారం కాబోతోంది తనకు మాత్రం ఒక అరుదైన వ్యాధితో బాధపడినట్లుగా పూనమ్ కౌర్ విషయం విన్న అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. అభిమానులు మాత్రం తెలుగులో నటించాలని కామెంట్స్ చేస్తున్నారు.