యానిమల్ మూవీలో నేనైతే నటించేదాన్ని కాదు.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్?

praveen
సందీప్ రెడ్డి వంగ డిఫరెంట్ సినిమాలకు పెట్టింది పేరు. ఇప్పటివరకు ఆయన తీసింది కేవలం రెండే రెండు సినిమాలు. కానీ ఆ రెండు సినిమాలతోనే ఊహించని రీతిలో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఏకంగా ఏకంగా బోల్డ్ కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించడంలో ఆయన తర్వాత ఎవరైనా అని నిరూపించుకున్నాడు. టాలీవుడ్లో అర్జున్ రెడ్డి అనే సినిమాను తీసి సరికొత్త ట్రెండు సృష్టించాడు. ఏకంగా చిన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషన్ విజయాన్ని సాధించాడు  ఇక ఈ మూవీతో అటు విజయ్ దేవరకొండ కూడా స్టార్ హీరోగా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే.

 ఇక ఇదే సినిమాను అటు బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ బ్లాక్ బాస్టర్ హిట్టు కొట్టాడు సందీప్ రెడ్డి వంగ. అయితే ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తో యానిమల్ అనే మూవీ తీశాడు. ఇక ఈ సినిమాలోను తనదైన మార్క్ బోల్డ్ కంటెంట్ కాస్త ఎక్కువగానే ఉంది. ఇక ఈ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాదాపు 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది ఈ మూవీ. ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్ కు జంటగా రష్మిక మందన నటించగా.. తృప్తి  ఒక కీలక పాత్రలో కనిపించింది అని చెప్పాలి. అయితే ఈ మూవీలో బోల్డ్ సన్నివేశాలపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.

 ఇదే విషయంపై స్పందించిన బాలీవుడ్ హీరోయిన్ తాప్సి సైతం యానిమల్ సినిమాలో కొన్ని సన్నివేశాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. యానిమల్ లాంటి సినిమాలలో తాను ఎప్పటికీ నటించలేను అంటూ తాప్సి చెప్పుకొచ్చింది. నటీనటులకు ఒక పవర్ ఉంటుంది. అదే సమయంలో బాధ్యత కూడా ఉంటుంది. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. నచ్చినట్టు ఉండే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ యానిమల్ తరహా సినిమాల్లో నటించే నటీనటులు బాధ్యతగా ఉంటే బాగుంటుంది. యానిమల్ సినిమాలో నేనైతే అస్సలు నటించేదాన్ని కాదు అంటూ చెప్పుకొచ్చింది తాప్సి. ఈ హీరోయిన్ చేసిన కామెంట్స్ కాస్త సంచలనంగా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: