అక్కినేని నాగార్జున @100.. మెగాస్టార్ @156 తో ఢీ?

praveen
అక్కినేని హీరోలు అందరికీ కూడా సంక్రాంతి పండుగ ఒక సెంటిమెంట్ గా కొనసాగుతూ వస్తుంది అన్న విషయం తెలిసిందే. మరి ముఖ్యం గా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న అక్కినేని నాగార్జున ఎక్కువగా తన సినిమాలను సంక్రాంతికి రిలీజ్ చేస్తూ ఉంటారు. దాదాపుగా నాగార్జున సినిమా సంక్రాంతి బరిలో దిగింది అంటే సూపర్ హిట్ కొట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సంక్రాంతికి అటు నా సామిరంగా సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్టు కొట్టాడు.

 అయితే అటు సంక్రాంతి బరి లో ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలు నిలిచాయి. ఇలా విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ నాగార్జున మాత్రం తనకు బాగా అచ్చోచ్చిన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరోసారి అక్కినేని అభిమానులు అందరిని కూడా ఫిదా చేసేసాడు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు వచ్చేయడాది సంక్రాంతి పై కన్నేసాడు ఈ అక్కినేని హీరో. ఈ క్రమం లోనే తన వందవ సినిమాని సంక్రాంతి కి విడుదల చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నాడు అని చెప్పాలి.

 నాగార్జున వందవ సినిమాకు దర్శకుడిగా తమిళ డైరెక్టర్ జ్ఞానవేల్ రాజా పని చేస్తున్నాడు.  అయితే ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. కాగా ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంబరా సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. దీంతో అక్కినేని నాగార్జున కెరియర్ లో ప్రతిష్టాత్మక మూవీగా తెరకేక్కుతున్న 100వ సినిమా చిరు 156వ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడబోతుంది. అయితే నాగార్జున మెగాస్టార్ చిరంజీవిలు ఇప్పటి వరకు ఎన్నోసార్లు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. మరి ఇప్పుడు మరోసారి ఇద్దరు సీనియర్ హీరోలు పోటీ పడేందుకు రెడీ అవ్వగా ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: