కల్కి 2898 లో ఊహించని పాత్రలు !

Seetha Sailaja
‘సలార్’ మూవీకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆమూవీ కలక్షన్స్ విషయంలో సృష్టించిన హంగామాతో ప్రభాస్ మ్యానియా మరొకసారి రుజువైంది. వరస ఫ్లాప్ లు తరువాత ప్రభాస్ ఫ్యాన్స్ కు ‘సలార్’ జోష్ ను కలిగించడంతో ఇక అందరి దృష్టి సమ్మర్ రేస్ కు రాబోతున్న ‘కల్కి2898’ పై ఉంది.

మే 9న విడుదలకాబోతున్న ఈమూవీ ఖచ్చితంగా 1000 కోట్ల కలక్షన్స్ ను తెచ్చిపెడుతుందని అభిమానులు అంచనాలు వేస్తున్నారు. ఈమూవీలో ఇప్పటికే అమితాబ్ దీపికా పదుకొనె కమలహాసన్ లాంటి హేమాహేమీలు నటిస్తున్న నేపధ్యంలో ఈమూవీ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు ఈసినిమాకు సంబంధించి మరొక షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది.

ఈ మూవీలో అతిధి పాత్రలలో నటించబోతున్న దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండలతో పాటు ఈసినిమా క్లైమాక్స్ కు ముందు వచ్చే కీలక ఘట్టంలో కృపాచార్య గా న్యాచురల్ స్టార్ నాని అదేవిధంగా పరశురాముడి గా జూనియర్ ఎన్టీఆర్ ను ఒప్పించడానికి ఈమూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. అయితే ప్రస్తుతం తారక్ కు పాన్ ఇండియా రేంజ్ లో ఏర్పడ్డ క్రేజ్ రీత్యా అతడిని అతిధి పాత్ర విషయంలో ఒప్పించడం అంత సులువైన పని కాదని మరికొందరి అభిప్రాయం.

తెలుస్తున్న సమాచారంమేరకు ఈమూవీ కథలో చాల ట్విస్ట్ లు ఉంటాయి అని అంటున్నారు. ఈమూవీ కథ ఆరు వందల సంవత్సరాల క్రితం బ్యాక్ డ్రాప్ తో మొదలై భవిష్యత్తు కాలానికి చేరుకుంటుందని అంటున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే ఈమూవీ పెండింగ్ షూటిం ను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘మహానటి’ మూవీ తరువాత దర్శకుడు నాగ్ అశ్విన్ కు ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ ఏ అవకాశాన్ని ఒప్పుకోకుండా పూర్తిగా అతడు తన దృష్టిని ఈమూవీ పైనే పెట్టడమే కాకుండా కమలహాసన్ తో నెగిటివ్ రోల్ చేయిస్తూ ఉండటంతో ఈమూవీ పై మరన్ని అంచనాలు ఉన్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: