చంటి సినిమా బాలయ్య చేయాల్సిందట.. ఎలా మిస్ అయ్యిందో తెలుసా?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేయడం చూస్తూ ఉంటాం. అయితే ఇలా ఒక హీరో రిజెక్ట్ చేసిన కథతోనే మరో హీరో సినిమా తీసి ఇండస్ట్రీ హిట్లు కొట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదే సమయంలో ఆయా హీరోలు ఫ్లాప్ చవిచూసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి అని చెప్పాలి. కొన్ని కొన్ని సార్లు ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాని మరో హీరో చేసి హిట్టు కొడితే.. ఇలా రిజెక్ట్ చేసిన హీరో బాధపడిపోవడం జరుగుతూ ఉంటుంది   అయితే గతంలో ఒక సినిమా విషయంలో నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ విషయంలో కూడా ఇలాంటిదే జరిగిందట. బాలకృష్ణతో చేయాలనుకున్న ఒక సినిమా విక్టరీ వెంకటేష్ చేయడం.. ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడం జరిగింది.

 1990 దర్శకంలో బాలయ్య, వెంకటేష్ ఇద్దరు కూడా స్టార్ హీరోలుగా కొనసాగుతూ వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతూ ఉన్నారు. ఈ క్రమంలోనే పరుచూరి బ్రదర్స్ ఒక ఆలోచన వచ్చింది. అయితే  బి.గోపాల్ ఇక ఆ సినిమాకు దర్శకత్వం వహించేందుకు సిద్ధమయ్యాడు. అయితే కోలీవుడ్ లో చిన్న తంబి అనే సినిమాను పి వాసు దర్శకత్వంలో వచ్చింది. ఇక ఆ సినిమాను చూసిన గోపాల్ ఈ సినిమాను చూశాను చాలా బాగుంది. ఇక ఈ మూవీని బాలయ్యతో చేస్తే బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారట.

 చిన్న తంబి సినిమా చూసిన తర్వాత పరుచూరి బ్రదర్స్ కూడా అదే అనుకున్నారట. అయితే సినిమా రైట్స్ కొనే విషయంలో  ఆలస్యం జరిగిపోయింది. దీంతో వీరికంటే ముందే కేఎస్ రామారావు ఈ సినిమా రైట్స్ కొనేసి వెంకటేష్ హీరోగా సినిమా తీసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక ఈ సినిమాకు రాజా పినిశెట్టి దర్శకత్వం వహించాడు. చంటి అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.ఇక చంటి సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతటి బ్లాక్ బస్టర్ విజయం సాధించేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీలో వెంకటేష్ కు జోడిగా మీనా నటించగా.. ఇలా బాలయ్య చేయాల్సిన సినిమా వెంకటేష్ చేసి హిట్టు కొట్టాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: