నా ప్రైవేట్ ఫోటో పబ్లిక్ లో పెడతారా.. విజయ్ దేవరకొండ హీరోయిన్ కామెంట్స్ వైరల్?

praveen
సాధారణంగా సినీ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఏకంగా సినీ సెలబ్రిటీలకు పర్సనల్ లైఫ్ ని  సీక్రెట్ గా దాచుకోవడం చాలా కష్టంగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఇలా హీరో హీరోయిన్స్ కి సంబంధించి ఏదైనా విషయం తెర మీదకి వచ్చింది అంటే చాలు అది నిమిషాల వ్యవధిలో అంతటా పాకి పోతూ ఉంటుంది. మరి ముఖ్యంగా సెలబ్రిటీల ప్రేమాయణాల గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు.

 కొన్ని కొన్ని సార్లు ఒక హీరో ఒక హీరోయిన్ ఎక్కువసార్లు కలిసి కనిపించారు అంటే చాలు వారి మధ్య ఏదో నడుస్తుంది అని రిలేషన్షిప్ అంటగట్టేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇలాంటి వార్తలు  తరచూ సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. అయితే కొన్ని కొన్ని సార్లు ఏకంగా సెలబ్రిటీలకు సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు కూడా ఇంటర్నెట్లో లీక్ అవుతూ వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇక విజయ్ దేవరకొండ హీరోయిన్ గా పేరున్న్న బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండేకి కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది. ప్రియుడుతో ఉన్న ప్రైవేట్ ఫోటోలు లీక్ అయ్యి వైరల్ గా మారాయి.

 బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటుడు ఆదిత్యారాయ్ ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఇద్దరు కూడా గత కొన్ని రోజుల నుంచి రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇటీవల వారిద్దరికీ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇక దీంతో ఈ ఫోటోలు ఈ వీరి రిలేషన్షిప్ వార్తలకు మరింత బలం చేకూర్చాయి అని చెప్పాలి. ఈ ఫోటోలపై స్పందించిన అనన్య పాండే మేము ప్రైవేట్ గా ఉన్న ఫోటోలను కూడా పబ్లిక్ లో పెడుతున్నారు. ఇది నిజంగా బాధాకరం అంటూ కామెంట్ చేసింది. కాగా అనన్య పాండే విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాలో నటించింది అన్న విషయం తెలిసిందే

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: