ఎన్టీఆర్ ఇచ్చిన సలహా.. చిరంజీవి కుటుంబాన్ని కాపాడిందట తెలుసా?

praveen
సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఏ చిన్న విషయం తెరమీదకి వచ్చిన అది తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల మెగాస్టార్ కు సంబంధించిన ఇలాంటి ఒక విషయమే ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోయింది. విశాఖపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పుణ్య తిధి, ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలు జరుగుతున్నాయ్. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

 అయితే ఈ కార్యక్రమంలో చిరంజీవి ఎన్టీఆర్ ఏఎన్నార్లతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇండస్ట్రీలో తనకు అప్పుడప్పుడే మంచి పేరు వస్తున్న సమయంలో ఎన్టీఆర్ ఇచ్చిన ఒక సలహా తన కుటుంబం మొత్తాన్ని కూడా కాపాడింది అంటూ మెగాస్టార్ చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఓ సమయంలో ఎన్టీఆర్ ను కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను పిలిచి రండి బ్రదర్ కూర్చోండి.. మీరు బాగా వృద్ధిలోకి వస్తున్నారు అంటూ పలకరించారు. మీ సంపాదనని ఇనుప ముక్కల కోసం వృధా చేసుకోవద్దు. మంచి ఇల్లు కట్టుకోండి. స్థలాలు తీసుకోండి అని ఎన్టీఆర్ సలహా ఇచ్చారు.

 సార్ డం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. మన సంపాదనని దాచుకు పెట్టుకోవాలి అంటూ ఎన్టీఆర్ సూచించారు. ఇక ఆయన చెప్పిన సలహా తోనే ఇక  సంపాదించిన మొత్తాన్ని కూడా సరైన మార్గంలో ఉపయోగించుకోవడం వల్ల తన ఫ్యామిలీ ఇక ఎలాంటి ప్రమాదంలో పడకుండా సేఫ్ గా ఉంది అంటూ చిరంజీవి తెలిపారు. ఇక ఎన్టీఆర్ చెప్పే వరకు కూడా తనకు కార్లు అంటే బాగా ఇష్టం ఉండేది. మార్కెట్లోకి కొత్త కారు వస్తే ఎలాగైనా కొనాలి అని ఆలోచించేవాడిని అంటూ తెలిపారు చిరంజీవి. ఎన్టీఆర్ చెప్పిన తర్వాత ఆయన సలహా పాటించాను.. ఆయన సలహా నా కుటుంబాన్ని కాపాడింది అంటూ చిరంజీవి గుర్తు చేసుకున్నారూ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: