నిజంగా నానీది ఎంత గొప్ప మనసు.. ఏకంగా మరోసారి?

praveen
సాధారణం గా ఇండస్ట్రీలో అప్పటికే మంచి సినిమాల తో గుర్తింపుని సంపాదించుకొని.. ఇక స్టార్ డైరెక్టర్గా కొనసాగుతున్న వారితో స్టార్ హీరోలు సినిమాలు చేయాలని ఆశ పడుతుంటారు. ఇక కొత్త డైరెక్టర్ తో సినిమాలు తీసి కొత్త ప్రయోగం చేసి చేతులు కాల్చుకోవడానికి ఎవరు పెద్దగా ఆసక్తిని కనబరచరు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఇండస్ట్రీ లో కొత్త దర్శకులకు ఛాన్సులు ఇచ్చే హీరోలు కేవలం కొంతమంది మాత్రమే ఉంటారు.

 అలాంటి వారిలో నాచురల్ స్టార్ నాని కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తన నటనతో తెలుగు ప్రేక్షకులకు నాచురల్ స్టార్ గా మారిపోయాడు నాని. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది కొత్త డైరెక్టర్లకి ఛాన్స్ ఇచ్చిన నాని ఇక ఇప్పుడు మరో కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు అన్నది తెలుస్తోంది.  పూరి జగన్నాథ్ దగ్గర పని చేసిన శివ అనే అబ్బాయి నానికి ఒక కథ వినిపించాడ.ట ఈ కథ అటు నానికి కూడా బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసాడట.

 ఇప్పటికే వివేక్ ఆత్రేయ, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో సినిమాలు చేయడానికి సిద్ధమయ్యాడు నాని. ఇక ఇప్పుడు ఓ కొత్త డైరెక్టర్ కు ఛాన్స్ ఇవ్వబోతున్నాడట. అయితే ఇలా వరుసగా చాన్స్ లు ఇస్తుండడం తో చిన్న డైరెక్టర్లు అందరికీ కూడా నాని పెద్ద హీరోగా మారిపోయాడు  దీంతో ఈ హీరోని దృష్టి లో పెట్టుకుని ఎంతో మంది దర్శకులు కథలు కూడా రాస్తూ ఉన్నారట. ఇక ఏదైనా మంచి కథ తన దగ్గరికి వచ్చిందంటే చాలు అతను కొత్త వాడ పాతవాడ అనే చూడకుండా నాని చాన్సులు ఇచ్చేస్తూ ఉన్నాడట. మరి ఇప్పుడు నాని పరిచయం చేయబోతున్న కొత్త దర్శకుడు ఇక ఎలాంటి సినిమాలు ప్రేక్షకులకు అందిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: