పవన్ 'తమ్ముడు' సినిమాలోని క్యూట్ హీరోయిన్.. ఇలా మారిపోయిందేంటి?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కొంతమంది ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్లుగా పాతుకపోతే.. ఇంకొంతమంది చేసినవి కొన్ని సినిమాలు అయినా ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇలా టాలీవుడ్ లో చేసిన కొన్ని సినిమాలతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రీతి జింగానియా  కూడా ఒకరు. ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తమ్ముడు మూవీలో పవన్ సరసన నటించింది.

 అరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకేక్కిన ఈ మూవీ ఎంతకు మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ఇప్పటికీ టీవీల్లో వచ్చిన కూడా టీవీ ముందు నుంచి కదలకుండా ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తూ ఉంటారు. ఇక ఈ మూవీలో పవన్ సరసన నటించిన ప్రీతి జింగానియా తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. జానకి అనే ఒక డీసెంట్ రోల్ లో నటించింది ఈమె. అందమైన రూపంతో అమాయకపు చూపులతో కుర్ర కారు మనసులు కొల్లగొట్టింది. అయితే ఇక బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఈమె ఎంతలా హవా నడిపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 అయితే తమ్ముడు సినిమా ద్వారా ప్రీతి జింగానియాకు మంచి గుర్తింపుని వచ్చింది. కానీ ఎందుకో అవకాశాలు మాత్రం అనుకున్నంతగా రాలేదు. ఈ క్రమంలోనే మిగతా భాషల సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. అయితే ఇటీవల పవన్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ప్రీతి జింగానియాకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఒకప్పుడు ఎంతో క్యూట్ గా కనిపించిన ఈ అమ్మడు ఇక ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. దీంతో ఇక ఇప్పుడు ప్రీతి జింగానియాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలు చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఒకప్పుడు తమ్ముడు సినిమాలో మేం చూసిన ఆ క్యూట్ అమ్మాయేన ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తుంది అంటూ చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: