గుంటూరు కారంపై ఫ్లాప్ టాక్.. ఒక్క మాటతో ఇచ్చి పడేసిన దిల్ రాజు?

praveen
సాధారణంగా సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద ఉండే పోటీ అంతా కాదు. స్టార్ హీరోలు అందరూ కూడా సంక్రాంతి బరిలో దిగేందుకు సిద్ధమవుతూ ఉంటారు. ఇక ఈసారి కూడా అదే జరిగింది. అయితే అనూహ్యంగా చిన్న హీరో తేజ సజ్జ కూడా స్టార్ హీరోలకు పోటీగా బరిలోకి దిగాడు అని చెప్పాలి. ఇతనికి ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి అని అందరూ అనుకున్నారు. అయితే అతని కాన్ఫిడెన్స్ వెనుక ఒక మంచి సినిమా ఉంది అన్నది హనుమాన్ చూసిన తర్వాత ప్రేక్షకులకు అర్థమైంది. అదే సమయంలో మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలిచింది.

 అయితే ఈ సినిమాకు కూడా పాజిటివ్ టాక్ వచ్చింది అని చెప్పాలి. కానీ అక్కడక్కడ కాస్త యావరేజ్ టాక్ కూడా రావడం గమనార్హం. ఇక ఇలా గుంటూరు కారం సినిమా రొటీన్ కథ ఉంది అంటూ సినీ ప్రేక్షకులు చెప్పారు. అయితే ఇలా గుంటూరు కారం మూవీ పై సోషల్ మీడియాలో వస్తున్న నెగటివ్ కామెంట్స్ పై నిర్మాత దిల్ రాజు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏకంగా సినిమా బాగోలేదు అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారికి దిమ్మతిరిగే సమాధానం చెప్పాడు దిల్ రాజు. గుంటూరు కారం సినిమాపై నెగెటివ్ టాక్ కూడా వినిపిస్తుంది. కొందరు పాజిటివ్గా స్పందిస్తున్నారు. మనం సినిమా బాగోలేదు బాగోలేదు అని థియేటర్ కు వెళ్లి చూస్తే ఖచ్చితంగా సినిమా నచ్చదు.

 సినిమా బాగుందట కదా అని మనసులో అనుకుని వెళ్లి థియేటర్లో సినిమా చూస్తే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఎవరో సినిమాకు నెగిటివ్ టాక్ బజ్ క్రియేట్ చేసి పెట్టి అది స్ప్రెడ్ చేయాలని చూస్తున్నారు. సినిమా బాగుంటే ఎవరు ఎవరిని ఆపలేరు. అది ఏ సినిమా అయినా సరే. మా సినిమా బాగుందని నేను పర్సనల్గా అందరికీ కాల్ చేసి కనుక్కున్నాను. సినిమాలో కొన్ని నెగటివ్స్ ఉన్నాయని ఒప్పుకుంటున్నాము. కానీ మహేష్ బాబు సినిమా కోసం కష్టపడిన తీరు అందరిని మిస్మరైజ్ చేస్తుంది అనడంలో సందేహం లేదు. సినిమా బాగుంది కలెక్షన్స్ కూడా బాగున్నాయి. రిజల్ట్ పట్ల సంతోషంగా ఉన్నాం అంటూ దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: