అతని టాలెంట్ కు.. ఆ అహంకారం కూడా అలంకారమేనా?

praveen
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఒక డైరెక్టర్ పేరు మారుమోగి పోతుంది. అతని పేరు ప్రశాంత్ వర్మ. తన గత సినిమాలతో తన మార్క్ డైరెక్షన్ ఏంటో చూపించి ప్రేక్షకులను ఫిదా చేసిన ప్రశాంత్ వర్మ.. ఇటీవల హనుమాన్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి మరోసారి సూపర్ హిట్ సాధించాడు. ఏకంగా పెద్ద హీరోలను కాదని ప్రేక్షకులందరూ హనుమాన్ సినిమాకి బ్రహ్మరథం పట్టేలా తన టేకింగ్ తో ఫిదా చేసేసాడు అని చెప్పాలి.

 అ! అనే సినిమాతో టాలీవుడ్లోకి డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత అప్పటికే కనుమరుగైన హీరోగా ఉన్న రాజశేఖర్ ని హీరోగా పెట్టి కల్కి అనే సినిమాను తీశాడు. ఇక ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు లేకపోయినా ఇక విడుదలైన తర్వాత మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది  ఇక తెలుగులో ఇప్పటివరకు ఏ డైరెక్టర్ ట్రై చేయని జాంబి అనే కాన్సెప్ట్ ను టచ్ చేసి జాంబీ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న ప్రశాంత వర్మ ఇటీవల హనుమాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

 హాలీవుడ్లో అవెంజర్స్ తరహాలోనే ఇక హనుమాన్ మూవీ మన సూపర్ హీరో కథ అంటూ ప్రశాంత్ వర్మ తెలిపాడు. మొదటినుంచి ఎన్నో ఆటంకాలు ఎదురైనా అటు సినిమా ఎట్టకేలకు విడుదలైంది. అయితే సంక్రాంతి రేసులో మహేష్ బాబు, నాగార్జున, వెంకటేష్, రవితేజ లాంటి ఎంతోమంది బడా హీరోలు బరిలోకి దిగారు. ఇలాంటి సమయంలో చిన్న సినిమాలు వెనక్కి తగ్గడం కామన్. కానీ ప్రశాంత్ వర్మ తగ్గలేదు. నా సినిమా ఫై నాకు కాన్ఫిడెన్స్ ఉంది అంటూ చెప్పాడు. దీంతో ఇతనికి పొగరు అని అందరూ అనడం మొదలుపెట్టారు.  హనుమాన్ సినిమా హిట్ అయితే అవతార్ కంటే మంచి సినిమా తీస్తా అంటూ చెప్పినప్పుడు ఇతనికి అహంకారం అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు హనుమాన్ మూవీ చూసిన తర్వాత అతనికున్న టాలెంట్ కి అతని కాన్ఫిడెన్స్ కి ఆ  అహంకారం కూడా అలంకారమే అంటూ ఎంతో మంది సినీ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: