టాలీవుడ్ ఇండస్ట్రీకి.. మరో రాజమౌళి దొరికేసాడా?

praveen
టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ది గ్రేట్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకుంది ఎవరు అంటే అందరూ కూడా రాజమౌళి పేరు చెబుతూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఎందుకంటే తన టేకింగ్ తో ప్రేక్షకులను ఫిదా చేసి ఏకంగా నిర్మాతలకు లాభాల పంట పండించడంలో రాజమౌళి దిట్ట అని చెప్పాలి. ఇక తన సినిమాలతో కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు ఈ డైరెక్టర్. అందుకే రాజమౌళినీ జక్కన్న అని పిలుస్తూ ఉంటారు.

 ఎందుకంటే జక్కన్న చెక్కే ప్రతి సినిమా కూడా ప్రేక్షకుడిని మెప్పించడంలో సక్సెస్ అవుతూ ఉంటుంది. అయితే రాజమౌళి సినిమాలను చూసిన తర్వాత ఆయన లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీకి మరొకరు దొరుకుతారా అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏకంగా మరో రాజమౌళి దొరికేశాడు అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మను ఇలా ఫ్యూచర్ రాజమౌళి తో పోలుస్తూ ఎంతో మంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

 అ!, కల్కి, జాంబిరెడ్డి ఇప్పుడు హనుమాన్ ఇలా తన సినిమాలతో ప్రశాంత్ వర్మ ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూనే ఉన్నాడు. తన టేకింగ్ తో ప్రేక్షకులను ఫిదా చేస్తూనే ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ క్రియేటివిటి చూసి అతని భవిష్యత్తు సినిమాలపై భారీ రేంజ్ లోనే అంచనాలు పెరుగుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక చిన్న డైరెక్టర్ అయినప్పటికీ ఏకంగా స్టార్ హీరోలతో పోటీపడేందుకు కూడా వెనకడుగు వేయట్లేదు. సంక్రాంతికి ఎంతోమంది స్టార్ల సినిమాలు ఉన్న తన సినిమాను రిలీజ్ చేసి హిట్టు కొట్టేశాడు. దీన్నిబట్టి అతని కాన్ఫిడెన్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అతని టాలెంట్ చూసిన తర్వాత ఇండస్ట్రీకి మరో రాజమౌళి దొరికేసాడు అంటూ ఎంతో మంది సినీ ప్రేక్షకులకు కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: