తేజ సజ్జ మామూలు కాదు.. బాహుబలి 2 ని వెనక్కి నెట్టేసాడు?

praveen
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన టాలెంట్ తో ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు అన్న విషయం తెలిసిందే. దీంతో ప్రశాంత్ వర్మ ఏదైనా సినిమా చేస్తున్నాడు అంటే చాలు ఏదో కొత్తగా ఉండబోతుంది అని ప్రేక్షకులు కూడా అనుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇప్పుడు టాలీవుడ్ లో తేజ సజ్జ హీరోగా  ఫిక్షనల్ మైథాలజీ థ్రిల్లర్ సినిమాను తెరకెక్కించాడు ప్రశాంత్. ఇక ఈ మూవీలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ హీరోయిన్గా నటించింది. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే సంక్రాంతి బరిలో మహేష్ బాబు, నాగార్జున సహ మరి కొంతమంది హీరోల సినిమాలు ఉన్నప్పటికీ ఇక తేజ సజ్జ తన సినిమా మీద ఉన్న నమ్మకంతో ఇక సంక్రాంతి బరిలోనే హనుమాన్ అనే సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ప్రస్తుతం చిత్ర బృందం బిజీ బిజీగా ఉంది అని చెప్పాలి. కాగా ఈ సినిమా ప్రీమియర్లకు తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యమైన స్పందన వస్తుంది. హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో భారీగా ప్రీమియర్లు ప్రదర్శించబోతున్నారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఈ ప్రీమియర్ల విషయంలో రాజమౌళి దర్శకత్వంలో తెరకేక్కిన  బాహుబలి 2 సినిమాను కూడా వెనక్కి నెట్టింది హనుమాన్. ఏకంగా వైజాగ్ లో బాహుబలి 2 కంటే ఎక్కువ ప్రీమియర్లు ప్రదర్శిస్తూ ఉండడం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక హనుమాన్ బిజినెస్ విషయానికి వస్తే నైజాం థియేటర్ రైట్స్ 7.5 కోట్లు, సీడెడ్ నాలుగు కోట్లు, ఆంధ్ర పది కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల హక్కుల మొత్తంగా 21.5 కోట్ల మీద అమ్మడం జరిగింది అన్నది తెలుస్తుంది. కర్ణాటక ఇతర రాష్ట్రాలలో ఈ సినిమా హక్కులు రెండు కోట్ల మేర అమ్ముడుపోయినట్లు సమాచారం. ఇక 28.5 కోట్లు వసూలు చేస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటుతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: