ప్రభాసా మజాకా.. సలార్ తో మరో రికార్డు బద్దలు కొట్టాడు?

praveen
దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులందరికీ సలార్ అనే సినిమాతో ఫుల్ మీల్స్ కాదు టేస్టీ బిర్యానీ దొరికేసింది. ఏకంగా ఈ సినిమా చూసి ప్రభాస్ అభిమానుల కడుపు నిండిపోయింది అని చెప్పాలి. ఎన్నో రోజులుగా ప్రభాస్ కి హిట్టు రావట్లేదు అని ఆందోళనలో పడిపోయిన అభిమానులు అందరినీ కూడా ఇక సంతోషంలో ముంచేసింది సలార్ మూవీ. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ డిసెంబర్ 22వ తేదీన క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు నుంచి సూపర్ హిట్ సొంతం చేసుకుంటూ భారీ వసూళ్లు సాధించింది అని చెప్పాలి.

 ఇక ఇటీవల 700 కోట్ల కలెక్షన్స్ మార్కును కూడా అందుకుంది ఈ మూవీ. ఇక ఇటీవల బ్రేక్ ఈవెంట్ కూడా సాధించేసింది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ అభిమానులు ఏదైతే కోరుకున్నారో.. ఇక అలాగే ప్రభాస్ ను చూపించి విజిల్స్ కొట్టేలా చేశాడు ప్రశాంత్ నీల్. మొదటి రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 178.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకుని సంచలనం సృష్టించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఈ మూవీ 700 కోట్ల మార్క్ ని దాటేసినట్లు ప్రముఖ ట్రేడ్ అనలిస్టు మనోబాల విజయ బాలన్ తెలిపారు. అయితే ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా 345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం.

 అంటే సలార్ మూవీ బ్రేక్ ఈవెంట్ దాటాలి అంటే 347 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ వసూలు చేయాలి. అయితే సుమారు 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టాలి. ఇక ఇటీవల సలార్ మూవీ ఈ మార్క్ ని క్రాస్ చేయడంతో సలార్ బ్రేక్ ఈవెన్ పూర్తయిపోయింది అని చెప్పాలి. అయితే ఈ కలెక్షన్స్ తో రెబల్ స్టార్ ప్రభాస్ మరో రికార్డును కూడా బద్దలు కొట్టాడు. 700 కోట్ల మార్కుని క్రాస్ చేసిన సినిమాలు ప్రభాస్ కి రెండు ఉన్నాయి. గతంలో బాహుబలి 2 ఇప్పుడు సలార్. ఇక సౌత్ లో 700 కోట్ల మార్క్ ని రెండుసార్లు అందుకున్న ఏకైక హీరో కేవలం ప్రభాస్ మాత్రమే కావడం గమనార్హం. అయితే సలార్ మేనియా ప్రస్తుతం థియేటర్లలో కొనసాగుతూ ఉండగా.. మరికొన్ని రోజుల్లో సంక్రాంతికి మరిన్ని భారీ సినిమాలు విడుదల కాబోతున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: