ఏవండోయ్ ఇది గమనించారా.. 'దేవర' మూవీకి తారక్ స్క్రీన్ నేమ్ మార్చేశారు.

praveen
త్రిబుల్ ఆర్ అనే సినిమాతో ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. తన నటనతో సినీ ప్రేక్షకులందరికీ కూడా ఫిదా చేసేశాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే త్రిపుల్ ఆర్ లాంటి వరల్డ్ వైడ్ హీట్ తర్వాత ప్రస్తుతం తారక్ చేస్తున్న మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మువిపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన తారక్ ఫస్ట్ లుక్ ప్రేక్షకులందరికీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని గత కొంతకాలం నుంచి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉన్నారూ అభిమానులు.

 అయితే ఇటీవల తారక్ దేవర మూవీకి సంబంధించిన గ్లింప్స్ ని విడుదల చేశారు. ఇక ఈ మూవీలో తారక్ మాస్ యాక్షన్ చూసి ప్రేక్షకులందరికీ కూడా పూనకాలు వచ్చేసాయి అని చెప్పాలి. కేవలం గ్లింప్స్  చూస్తేనే పరిస్థితి ఇలా ఉంటే ఇక పూర్తి సినిమా చూస్తే గూస్ బంప్స్ రావడం పక్క అని అభిమానులు అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు. ఏకంగా సముద్రంలో ఇక ఎన్టీఆర్ విలన్లను ఊచకోత కోయడం చూస్తూ ఉంటే దేవర సినిమా అంచనాలకు మించి ఉండబోతుంది అని ప్రేక్షకులు అందరూ కూడా భారీగానే అంచనాలు పెట్టుకుంటున్నారు.

 అయితే ఇక ఇటీవలే దేవర మూవీకి సంబంధించి గ్లింప్స్ విడుదలైన తర్వాత ఒక విషయం కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. గతంలో తారక్ స్క్రీన్ నేమ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని ఉండేది. కానీ దేవర సినిమాకు మ్యాన్ ఆఫ్ మాసేస్ అని స్క్రీన్ నేమ్ ని మార్చేశారు. అభిమానులు ఎన్టీఆర్ ని ఇలా మ్యాన్ ఆఫ్ మాసేస్ అని గత కొంతకాలంగా ముద్దుగా పిలవడం మొదలు పెట్టారు. ఇక ఇప్పుడు అదే  పేరుని తారక్ స్క్రీన్ నేమ్ గా పెట్టేశారు అనేది తెలుస్తుంది. ఇక ఇది చూసి ఫాన్స్ అందరు కూడా తెగ సంబరపడిపోతున్నారు. ఇది ఎన్టీఆర్ కి సరిగ్గా సరిపోయే ట్యాగ్ అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: