మంచు విష్ణు 'కన్నప్ప' సినిమాతో.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ హీరో కొడుకు?

praveen
కలెక్షన్ కింగ్ మంచి మోహన్ బాబు వారసుడు మంచు విష్ణు కెరియర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న  సినిమా కన్నప్ప. భక్తకన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది అన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ మహాభారతం టీవీ సీరియల్ ఫేమ్ అయిన ముఖేష్ కుమార్ దర్శకత్వంలో ఇక ఈ మూవీ తెరకెక్కుతూ  ఉండడం గమనార్హం. ఏకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న  ఈ సినిమాపై ఇక భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఈ మూవీలో మోహన్లాల్, ప్రభాస్, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోలు సైతం కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు అన్న విషయం తెలిసిందే. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.

 ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక మంచు వారి అభిమానులందరూ కూడా ఈ మూవీ ఎప్పుడేప్పుడు ఉంటుందో అని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే మంచు విష్ణు డ్రీం ప్రాజెక్టుగా తేరకేకుతున్న కన్నప్ప సినిమాలో అటు ఒక స్టార్ హీరో కొడుకు తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఏకంగా మరో లిటిల్ స్టార్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాడు  మంచు విష్ణు. అతను మరెవరో కాదు మంచు విష్ణు తనయుడు అవ్రామ్ మంచు. తన ఐదేళ్ల కొడుకుని బాల నటుడిగా ఇక చిత్ర పరిశ్రమకు పరిచయం చేయబోతున్నాడు మంచు విష్ణు.

 అయితే ఇక తన డ్రీమ్ ప్రాజెక్టుగా తేరకెక్కుతున్న కన్నప్ప సినిమాతోనే ఏకంగా తన కొడుకుని ఇండస్ట్రీకి పరిచయం చేయడం సంతోషంగా ఉంది అంటూ చెప్పాడు. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా మంచు విష్ణు స్వయంగా అనౌన్స్ చేశాడు అని చెప్పాలి. ఇక ఇది కాస్త వైరల్ గా మారిపోయింది. ఇక ఈ వార్త మంచు వారి అభిమానులందరికీ కూడా పండగ లాంటి న్యూస్ గా మారిపోయింది. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాలో మోహన్ బాబు తో పాటు మంచు విష్ణు నటిస్తున్నాడు. ఇక ఎప్పుడూ మూడోతరం మంచు వారి హీరో కూడా నటిస్తూ ఉండడంతో ఇంతకంటే అదృష్టం ఏముంటుంది అని మంచు వారి అభిమానులు అందరూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: