కుర్చీ మడత పెట్టి పాటకి స్టెప్పులేసిన టేస్టీ తేజ, శుభ శ్రీ.. వీడియో వైరల్..!

Anilkumar
సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా కూడా ప్రస్తుతం కుర్చీ మడత పెట్టి పాటే వినబడుతుంది. దానిపై సోషల్ మీడియాలో విపరీతంగా డాన్స్ చేస్తున్నారు జనాలు. మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలోని ఈ పాట ఎంతలా వైరల్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాదు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మీ డైలాగులు ఈ పాటలో పెట్టడంతో ఎక్కడ విన్నా కూడా ఇదే పాట వినపడుతోంది. అయితే తాజాగా ఈ పాటకు బిగ్ బాస్ బ్యూటీ శుభ శ్రీ టేస్టీ తేజ ఇద్దరు డాన్స్ వేశారు. కుర్చీ మడత పెట్టి అంటూ పాటలో రెచ్చిపోయారు వీరిద్దరూ.

ఇక డీటెయిల్స్ లోకి వెళితే.. బిగ్ బాస్ షో ద్వారా ఇప్పటికే చాలామంది మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. అంతేకాదు ఈ షో ద్వారా చాలామంది సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. మరికొందరు సోషల్ మీడియా స్టార్లు అయ్యారు. ఇక టేస్టీ తేజ విషయానికి వస్తే.. సోషల్ మీడియాలో ఫుడ్ బ్లాగ్స్ చేసుకుంటూ చాలామందికి పరిచయమయ్యాడు తేజ. అంతే కాదు జబర్దస్త్ షోలో సైతం స్కిట్లు చేశాడు. అలా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు టేస్టీ తేజ.  ఇటీవల బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టి బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు. ఇక సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ శుభ శ్రీ రాయగురు..

 బిగ్ బాస్ షోకి వచ్చే వరకు ఎవరికి పెద్దగా తెలియదు. ఈ భామ పలు సినిమాల్లో కూడా నటించింది. అయినా అంతగా గుర్తింపు రాలేదు. అయితే బిగ్ బాస్ షో ద్వారానే ఈ భామ బాగా ఫేమస్ అయింది. బిగ్ బాస్ షో అనంతరం బయటకు వచ్చాక టేస్టీ తేజ, శుభ శ్రీ, గౌతమ్ ఫుడ్ వ్లాగ్స్ చేశారు. గెట్ టు గెదర్ అయ్యారు. ఇక తాజాగా టేస్టీ తేజ... శుభ శ్రీ తో కలిసి డ్యాన్స్ చేశాడు.  సోషల్ మీడియాలో ఏ ఫ్లాట్ ఫాం ఓపెన్ చేసినా... వీటిపైనే రీల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టేస్టీ తేజ, శుభ శ్రీ కలిసి ఈ పాటపై స్టేప్పులు వేశారు. కుర్చి మడత బెట్టి అంటూ రెచ్చిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: